E-Paper
Advertisement

కోట్లు కురిపించే షిప్పింగ్ యార్డ్ పై కన్ను… ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కోట్లు కురిపించే షిప్పింగ్ యార్డ్ పై కన్ను… ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Isakapatnam OTT: తండ్రులకు కుతూర్లంటే ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పలేము. కానీ గారాబంగా పెంచుకున్న ఆ కూతురే పెరిగి పెద్దయ్యి గుండెల మీద తంతే ? ఏకంగా తండ్రి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాలని కంకణం కట్టుకుంటే… ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన సిరీసే ‘ఇసకపట్నం’ (Isakapatnam). జూలై 2 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఉత్కంఠభరితమైన ఒరిజినల్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. 1990ల కాలం నాటి కోస్తాంధ్రలోని ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో రాజకీయం, అక్రమ వ్యాపారాలు, నేర సామ్రాజ్యం, కుటుంబ ద్రోహాలను వంటి అంశాలను అద్భుతంగా అల్లారు మేకర్స్. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒకప్పుడు సాదాసీదాగా ఊరిలోకి అడుగు పెట్టిన నాయుడు (సముద్రఖని), అతని కూతురు చుట్టే తిరుగుతుంది స్టోరీ అంతా. ఆయన క్రమంగా ఎదుగుతూ, ఆ పోర్ట్ టౌన్‌ లోని రాజకీయాన్ని, అక్రమ వ్యాపారాలను, గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంతో కథ మొదలవుతుంది. అధికారం, రాజకీయ అండతో ఇసకపట్నంపై అప్రతిహతంగా ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. అతని సామ్రాజ్యం రోజురోజుకూ విస్తరిస్తూ, ఊరంతా అతని భయంతో వణికిపోతుంది.

Advertisement

కానీ ఈ క్రూరమైన నేర సామ్రాజ్యానికి, అతని అధికారావిష్కరణకు ఊహించని విధంగా అతని సొంత కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్) ఎదురు తిరుగుతుంది. తన తండ్రి సృష్టించిన ఈ నేర ప్రపంచం వల్ల జరుగుతున్న అన్యాయాలను, సామాన్యుల బాధలను ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె తండ్రి సామ్రాజ్యాన్ని నేల కూల్చడానికి నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో నాయుడు సామ్రాజ్యాన్ని కూల్చడానికి మరో రెండు శక్తులు కూడా రంగంలోకి దిగుతాయి. ఒకవైపు నమ్మకద్రోహానికి గురై లోలోపల రగిలిపోయే ఒక అనుచరుడు, మరోవైపు నాయుడి వల్ల సర్వస్వం కోల్పోయి పగతో రగిలిపోయే ఒక సామాన్య వ్యక్తి తోడవుతారు.

ఈ త్రిముఖ పోరాటం ఇసకపట్నంలో రక్తపాత యుద్ధానికి దారితీస్తుంది. ఈ సిరీస్ కేవలం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, కుటుంబ బంధాలు, తండ్రీ-కూతుళ్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, రాజకీయ కుట్రలు, నమ్మకద్రోహాలు, న్యాయం కోసం జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుంది. నాయుడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాడు ? భారతి తన తండ్రిని ఎదిరించి న్యాయం సాధించగలుగుతుందా ? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవలసిన కథ.

Advertisement

సముద్రఖని గ్యాంగ్ స్టర్ గా, ఐశ్వర్య రాజేష్ బ్రేవ్ అమ్మాయి పాత్రతో, సునీల్, నరేష్ అగస్త్య వంటి నటీనటుల మంచి సపోర్టింగ్ పాత్రలతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కథ, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఉత్కంఠభరితంగా ఉంటాయి. 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Videoలో ఒరిజినల్ తెలుగు భాషలో అందుబాటులో ఉంది. అలాగే హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: యాంగ్రీ బర్డ్ బాస్ తో లేడీ ఎంప్లాయ్ లవ్ స్టోరీ… ఎంగేజింగ్ కొరియన్ రోమ్ కామ్ సిరీస్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×