OTT Movie : ప్రేక్షకులను నవ్వించే ఉద్దేశంతో దర్శకులు కొన్ని సినిమాలు తీస్తుంటారు. అయితే హాలీవుడ్ లో ఒక సినిమాని ఇదేవిధంగా తీశారు. దీనిని కొంతమంది పరమ చెత్త సినిమాగా వర్ణించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. దాని బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగానే సంపాదించింది. ఈ మూవీ కొన్ని హాలీవుడ్ సినిమాలను సెటైరికల్ గా మిక్స్ చేసి రూపొందించారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ పేరడీ కామెడీ పేరు ‘ఎపిక్ మూవీ’ (Epic Movie). ఇది జాసన్ ఫ్రైడ్‌బర్గ్, ఆరోన్ సెల్ట్జర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రధానంగా పాపులర్ హాలీవుడ్ ఎపిక్ ఫిల్మ్‌లను, ఇతర సినిమాలను అనుకరిస్తుంది. ఈ మూవీ ‘The Chronicles of Narnia,’ ‘Harry Potter,’ ‘Charlie and the Chocolate Factory,’ ‘ Pirates of the Caribbean’ వంటి సినిమాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని వక్రీకరించి చూపిస్తుంది. ఇందులో కల్ పెన్, ఆడమ్ కాంప్‌బెల్, జయమా మేస్, జెన్నిఫర్ కూలిడ్జ్, ఫౌన్ ఎ. ఛాంబర్స్, క్రిస్పిన్ గ్లోవర్, టోనీ కాక్స్ ఫ్రెడ్ విల్లార్డ్ నటించారు. ఈ సినిమా స్టోరీ కంటే, విపరీతమైన కామెడీ కంటెంట్ నిండి ఉంది. చాలా మంది దీనిని చెత్త చిత్రాలలో ఒకటిగా పరిగణించారు. అయినప్పటికీ, ఇది బాక్స్ ఆఫీస్ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా $87 మిలియన్లను వసూలు చేసింది. దాని బడ్జెట్ మాత్రం $20 మిలియన్లు మాత్రమే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా నలుగురు అనాథల చుట్టూ తిరుగుతుంది. లూసీ, ఎడ్వర్డ్, సుసాన్, పీటర్ . వీరందరూ విభిన్నమైన పరిస్థితులలో అనాథలుగా పెరుగుతారు. వారు ఒక గోల్డెన్ టికెట్‌ను కనిపెట్టి, విల్లీ వొంకా నడిపే చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అక్కడ వారు ఒక మాయా వార్డ్‌రోబ్ ద్వారా ‘నార్నియా’అనే ఫాంటసీ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అది జ్ఞార్నియా అని పిలువబడుతుంది. జ్ఞార్నియాలో, వాళ్ళు ఒక సింహ రాజు అస్లాన్ నేతృత్వంలోని తిరుగుబాటుదారుల బృందంతో కలుస్తారు. అక్కడ వారు దుష్ట శక్తులు ఉండే, ఒక వైట్ విచ్ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వారు అనేక విచిత్రమైన మనుషులను కలుస్తారు. అవి వివిధ హాలీవుడ్ సినిమాల నుండి స్పూఫ్ చేయబడినవి. ఉదాహరణకు, హ్యారీ పాటర్‌ను పేరడీ చేసిన హ్యారీ బీవర్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నుండి కెప్టెన్ జాక్ స్విల్లోస్ వంటివి. ఇక ఆ వైట్ విచ్ వలన, ఒక ప్లేన్ మొత్తం ప్రయాణికులతో పాటు, పాములు కూడా వస్తాయి. ఇక ఈ నలుగురు తమను తాము రక్షించుకోవడానికి, వైట్ విచ్‌ను ఓడించడానికి ఒక అదిరిపోయే పధకం వేస్తారు. చివరికి వాళ్ళు వేసిన పధకం ఏమిటి ? వైట్ విచ్ ను ఎలా నియాంత్రిస్తారు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : టీనేజ్ లో లవ్ లో పడితే, ఇలాగే రోడ్ల మీద… పక్కా అడ*ల్ట్ కంటెంట్… కుర్చీ కోసం పాడు పనులు