RR Vs GT : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ కి శుబ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ బ్యాటింగ్ చేయనుంది.
ఇప్పటి వరకు రెండు జట్టు 6 సార్లు తలపడగా.. అందులో 5 సార్లు గుజరాత్ జట్టు గెలవడం విశేషం. చివరగా 2023లో నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ విజయం సాధించింది. ఈసారి కూడా అలాంటి విజయాన్ని రాజస్థాన్ సాధిస్తుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లలో ఇంపాక్ట్, సబ్స్ ప్లేయర్లుగా వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, అనుజ్ రావత్, మహిపాల్, లామ్రోర్, అర్షద్ ఖాన్ ఉండనున్నారు.
ఇక ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ మెరుగైన ప్రదర్వన కనబరుస్తోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడితే మూడు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టిక రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడితే రెండు మ్యాచ్ లలో గెలిచింది. మరో రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ అధిక మ్యాచ్ లు గెలవడం.. రాజస్థాన్ తక్కువ మ్యాచ్ లు గెలవడంతో గుజరాత్ కి పాజిటివ్ గా కనిపిస్తోంది.
రాజస్థాన్ జట్టు కూడా మంచి హిట్టర్లతో మంచి ఫామ్ లోనే కనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ వేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ మధ్య కాలంలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా వంటి జట్లు ఓడిపోయిన విషయం విధితమే. తాజాగా గుజరాత్ టైటాన్స్ కూడా అలాగే ఓడిపోతుందని రాజస్థాన్ అభిమానులు పేర్కొనడం గమనార్హం. సాధారణంగా హోం గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్టుకు నల్లేరు పై నడకలాంటిది అంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని జట్లు సొంత మైదానంలో కూడా సత్తా చాటలేకపోతున్నాయి. గుజరాత్ జట్టు కూడా అదే కోవాలో కొనసాగుతుందా..? లేక సొంత మైదానంలో విజయం సాధిస్తుందా వేచి చూడాలి.
గుజరాత్ టైటాన్స్ : శుబ్ మన్ గిల్, సాయి దర్శన్, శుబ్ మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్ పోర్డ్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రినివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హిట్మేయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, ఫరూకీ, సందీప్ శర్మ, దేశ్ పాండె.