Little Hearts Movie OTT Update: ఈ మధ్య తెలుగు బాక్సాఫీసు సందడి కరువైంది. పాన్ ఇండియా చిత్రాలు సైతం బొల్తా కొడుతున్నాయి. దీంతో వసూళ్లు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీసును నిలబెట్టిన చిత్రం లిటిల్ హార్ట్స్. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకంది. కేవలం రూ. 2 కోట్ల తెరకెక్కిన ఈ సినిమా 15 రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూళ్లు సాధించింది. మిరాయ్ వంటి పాన్ ఇండియా మూవీకి సైతం ఈ చిన్న సినిమా పోటీ ఇస్తుంది. విడుదలై మూడు వారాలు అవుతున్న ఇప్పటికి థియేటర్లలో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.
ఇంత బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సినిమాపై దర్శక–నిర్మాతలు, అగ్ర హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ట్వీట్ చేసి లిటిల్ హార్ట్స్ని పొగిడారు. ఇక విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీ హీరోని స్వయంగా కలిసి తన రౌడీ బ్రాండ్ టి–షర్ట్ బహుమతిగా ఇచ్చాడు. యూత్ ఫుల్ లవ్ అండ్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఇప్పటికీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో హౌజ్ ఫుల్తో లిటిల్ హార్ట్స్ విజయవంతంగా రన్ అవుతోంది. ఓ పక్క థియేటర్లలో ఉన్నప్పటి ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెల రోజుల ముందే లిటిల్ హార్ట్స్ డిజిటిల్ ప్రీమియర్‌కు రానుందంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఈటీవీ విన్లో ఈ దసరా(అక్టోబర్ 2) నుంచి లిటిల్ హార్ట్స్ స్ట్రిమింగ్కి రానుందనేది దాని సారాంశం. ఈ మేరకు ట్విటర్లో ఇందుకు సంబంధించిన పోస్ట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా మూవీ మేకర్స్ స్పందించారు. లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చెబుతూ ఆడియన్స్ని హెచ్చరించారు. ఇంతకి మేకర్స్ ఏమన్నారంటే.. “లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ప్రకటించేందుకు మేము చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. కానీ, ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీకి వచ్చే అవకాశం లేదు.
Also Read: Manchu Lakshmi: బాడీ షేమింగ్.. ప్రముఖ జర్నలిస్ట్‌పై ఫిల్మ్ ఛాంబర్‌లో మంచు లక్ష్మి ఫిర్యాదు
కాబట్టి.. అప్పుడే దీనికోసం ఎదురుచూడకండి. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ ఇప్పటికీ హౌజ్ఫుల్ తో థియేటర్లతో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై వస్తున్న వార్తలను నమ్మకండి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ ఫేక్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇకపై అలా చేస్తే మీ ఫోన్ మీద ఒట్టే” అంటూ మేకర్స్ ఫన్నీగా ఈ రూమర్స్ ఖండించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా మౌళి తనుజ్ ప్రశాంత్, శివాణి నగరం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జయ కృష్ణ, అనిత చౌదరి, ఎస్.ఎస్. కంచి, సత్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్లో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాకు సంజిత్ మెర్రమిల్లి సంగీతం అందించారు.
"We are excited to announce #littlehearts OTT release date…."
Don't expect this 😂😂
We are still running housefull in theatres🥳🥳Ela fake images spread chesthe mi phone mida otte😂 pic.twitter.com/lnSlwuB9Fo
— ETV Win (@etvwin) September 19, 2025