రీతూ చౌదరి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. బుల్లితెర నటిగా కంటే, ఏపీలో జరిగి రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ స్కామ్ లో ఆమె భర్త, రియల్టర్ చీమకుర్తి శ్రీకాంత్ పేరుతో పాటు రీతూ పేరు కూడా బయటకు వచ్చింది. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు శ్రీకాంత్, ఆమె పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరూ మీడియాకు ఎక్కారు. శ్రీకాంత్ తనను మోసం చేశాడని, విడాకుల కోసం కోర్టులో కేసు వేశానని చెప్పింది. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి సెలబ్రిటీ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నేపథ్యంలో మరోసారి ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో రీతు తనతో విడిపోడానికి గల కారణాలను బిగ్ టీతో వెలడించాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..
ల్యాండ్ స్కామ్ ఇష్యూ, ఏసీబీ వాళ్ల కారణంగానే తనకు, రీతూకు మధ్య గొడవలు వచ్చాయని శ్రీకాంత్ చెప్పాడు. ఆమెను ఏసీబీ వాళ్లు బెదిరించి భయపెట్టారనన్నారు. “వాస్తవానికి ఈ సమస్యతో రీతూకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రీతు పేరు మీద ఆస్తలు రిజిస్టర్ చేయించానని చెప్పడం నిజం కాదు. నాకు కోట్ల రూపాయల ఆస్తులు లేవు. వైసీపీ నేతలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. రీతుతో నేను లవ్ లో ఉన్నప్పుడు కొన్ఇన ప్రాపర్టీపై పవర్ ఇచ్చాను. సేల్ లీడ్ కాదు. నాకు రీతూ విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేసు నడుస్తుంది. ఇంకా విడాకులు తీసుకోలేదు. మా పర్సనల్ ఇష్యూలో, మాకు సంబంధంలేని విషయంలో ఏసీబీ వాళ్లు మమ్మల్ని టార్గెట్ చేశారు. నా సొంత ఆస్తుల్ని కూడా తీసుకున్నారు. రీతూను ఈ కేసులో ఇరికించి ఆమెను గంటల తరబడి వేధించారు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. విషయం విడాకుల వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది” అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
అటు ఈ వ్యవహారం పైన రీతూ కూడా స్పందించింది. తనకు పెళ్లి అయిన మాట వాస్తవమేనని, కానీ ఆయన ప్రవర్తన నచ్చక విడిపోయినట్లు చెప్పింది. “నాకు పెళ్లి అయిన మాట నిజమే. కానీ, ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే, అతడికి దూరంగా వచ్చేశాను. నాలుగు నెలలు మాత్రమే నేను కలిసి ఉన్నాను. ఆ తర్వాత అతడితో విడిపోయిన ఉంటున్నాం. విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. శ్రీకాంత్ అనే వ్యక్తిని నేను గుడ్డిగా నమ్మి మోసపోయాయాను. ఓ భూ కుంభకోణంతో నాకు సంబంధం లేదు. నన్ను అందులోకి లాగకండి” అంటూ చెప్పుకొచ్చింది.
Read Also: కెప్టెన్సీ వార్… ఆ లవ్లీ జంట మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్