OTT Movie : ఓటిటిలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు కొత్తగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక ఆత్మ ప్రతిరోజూ మనుషుల్లో ప్రవేశిస్తూ వాళ్లను నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ఆ ఆత్మ ఒక అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఇటువంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ, చివరివరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ పేరు ‘ఎవ్రి డే’ (Every Day). ఈ మూవీకి డేవిడ్ లెవితాన్ రాసిన నవల ఆధారంగా, మైఖేల్ సక్సీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అంగౌరీ రైస్ 16 ఏళ్ల రియానన్ పాత్రలో నటించింది. ఆమె ఒక ఆత్మతో ప్రేమలో పడుతుంది. ఆ ఆత్మ ప్రతి రోజు శరీరాలను మారుస్తుంటుంది. వీళ్లిద్దరి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో జస్టిస్ స్మిత్, డెబ్బీ ర్యాన్, మరియా బెల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఒక ఆత్మ ప్రతిరోజు ఒకరి శరీరం నుంచి, మరొక శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. వాళ్లను నియంత్రిస్తూ తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో జస్టిన్ అనే వ్యక్తిలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. జస్టిన్ ను రియానన్ అనే అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను ఆమెను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఆత్మ అతనిలోకి ప్రవేశించినప్పుడు రియానన్ ను ప్రేమించడం మొదలుపెడతాడు. జస్టిన్ ను కంట్రోల్ చేస్తూ స్పిరిట్ ఆమెను ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ బయట సరదాగా తిరిగి ఎంజాయ్ చేస్తారు. ఆ మరుసటి రోజు స్పిరిట్ అతనిలో నుంచి వెళ్ళిపోతుంది. అతడు మళ్ళీ ఏమీ తెలియనట్టు సాధారణంగా రియానన్ తో ప్రవర్తిస్తాడు. ఇది చూసి రియానన్ ఆశ్చర్యపోతుంది. నాథన్ అనే వ్యక్తిలో మళ్ళీ ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. రియానన్ ను కలసి తాను ఎవరో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది.
అలా కొంతమంది శరీరాలు మార్చిన తర్వాత హీరోయిన్ కి నిజంగానే ఆత్మ ఉందని అర్థమవుతుంది. ఇలా ఆత్మతో రియానన్ రిలేషన్ క్రమంగా బలపడుతుంది. ఈ ఆత్మ ఆమె ప్రేమకోసం బాగా ఆరాటపడుతుంది. చాలామంది శరీరాలను ప్రయత్నించాక, చివరికి అలెగ్జాండర్ అనే వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అతడు మంచివాడని హీరోయిన్తో ఆత్మ చెప్తుంది. అలాగే వాళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. ఎక్కువకాలం తాను ఇక్కడ ఉండలేనని, అలెగ్జాండర్ ని హీరోయిన్ కి సెట్ చేస్తుంది ఆత్మ. నేను వెళ్ళాక అతనితోనే కలసి ఉండమని చెప్తుంది. చివరికి ఈ ఆత్మ ఏమవుతుంది? అలెగ్జాండర్ తోనే హీరోయిన్ కలిసి ఉంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.