Gopichand New Movie: కొందరు హీరోలకు ఎంత టాలెంట్ ఉన్నా.. లక్ కలిసి రాక హిట్లు కొట్టలేకపోతారు. అలాంటి వారు ప్రతీ ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో లక్ కలిసి రాక అండర్ రేటెడ్‌గా మిగిలిపోయిన హీరో ఎవరు అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు గోపీచంద్. ఫిజిక్, టాలెంట్, యాక్టింగ్.. ఇలా అన్ని విషయాల్లో స్టార్ హీరోలతో పోటీపడే స్టామినా ఉన్నా గోపీచంద్‌కు ఎందుకో హిట్లు మాత్రం దక్కడం లేదు. అందుకే దర్శకులను మారుస్తూ తన లక్‌ను పరీక్షించుకుంటూ ఉన్నాడు. తాజాగా ఒక యంగ్ డైరెక్టర్‌ను నమ్ముకొని సినిమా ప్రారంభించాడు. ఆ యంగ్ డైరెక్టర్‌తో కలిసి గోపీచంద్ చేస్తున్న అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.
మైథలాజికల్ సినిమా
ఇప్పటికే ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ఒక సినిమాను ఓకే చేశాడు గోపీచంద్. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ వచ్చే నెల 4 నుండి కశ్మీర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇక డైరెక్టర్‌గా డెబ్యూ చేసినప్పటి నుండి డిఫరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy).. గోపీచంద్‌తో చేస్తున్న సినిమా కోసం కూడా ఒక డిఫరెంట్ థీమ్‌ను ఎంచుకున్నాడట. వీరి కాంబోతో తెరకెక్కే సినిమా మైథలాజికల్ జోనర్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ అంతా ఫిక్స్ అయినా కూడా ఇంకా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ ఫైనల్ అవ్వలేదట.
ఫైనల్ అవ్వలేదు
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో గోపీచంద్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరూ అనే విషయం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇందులో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గానీ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మూవీ టీమ్ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. కనీసం ఈ మైథలాజికల్ మూవీ అయినా గోపీచంద్‌కు హిట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఒక సాలిడ్ హిట్ కోసం గోపీచంద్ ఎలా ఎదురుచూస్తున్నాడో.. తనకు సరైన హిట్ పడితే బాగుంటుందని తన ఫ్యాన్స్ కూడా అలాగే కోరుకుంటున్నారు.
Also Read: కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దుర్మార్గం.. నటి 14 నిమిషాల వీడియో లీక్..
వరుస డిశాస్టర్లు
గోపీచంద్ (Gopichand) గత సినిమాలు అన్నీ ఒకదానికి మించి మరొకటి డిశాస్టర్లు అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు అయితే అసలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెళ్లిపోయాయి అనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇందులో చాలావరకు సినిమాలకు కనీసం ఓటీటీలో కూడా ఆదరణ లభించలేదు. దీంతో తను కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2024లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపీచంద్. అందులో ‘విశ్వం’ కూడా ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో దీంతో డైరెక్టర్, హీరో ఇద్దరూ కమ్ బ్యాక్ ఇస్తారు అనుకుంటే ఇది గోపీచంద్ కెరీర్‌లోనే అతిపెద్ద డిశాస్టర్‌గా మిగిలిపోయింది.