Saratoga Water : సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అనుకోకుండా భలేగా వైరల్ అవుతుంటాయి. కొందరి ఛానెళ్లకు లక్షల్లో వీక్షకులు ఉంటుంటారు. వారంతా.. అందులోని కంటెంట్ ను తప్పకుండా పాటించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా.. అమెరికాకు చెందిన యూట్యూబ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆష్టన్ హాల్ చేసిన ఓ వీడియో కారణంగా.. ఓ నీళ్లు కంపెనీకి భారీగానే లాభం చేకూరింది. ఉద్దేశ్యపూర్వకంగా చేయకపోయినా.. యూజర్లు దృష్టి మొత్తం ఓ బాటిల్ పైకి వెళ్లడంతో.. దాని అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. అలా ఎలా జరిగింది.. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ ఎవరో.. మీరు తెలుసుకోండి. ఇలాంటి ఘటనలు మీకెప్పుడైనా జరిగాయో సరిచూసుకోండి.
ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో నచ్చేది ఏమిటి? వారి కఠినమైన దినచర్యలు, లెక్కించిన ఆహారాలు, ఉక్కు శరీరాలు. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ప్రయోజనాల్ని అందరికీ అర్థం అయ్యేలా చెప్పడంలో ఎవరి ప్రత్యేకత వాళ్లది. అయితే.. కొన్నిసార్లు వాళ్లు చేసిన అసలు పనుల్ని పట్టించుకోకుండా.. కొసరు పనుల్ని పట్టించుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఘటనే ఇంది.
అమెరికాకు చెందిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్ మార్నింగ్ రొటీన్ వీడియో అనూహ్యంగా సూపర్ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అతను చెప్పిన విషయం ఏంటంటే.. రోజూ ఉదయాన్నే తను ఉదయం 4 గంటలకంటే ముందుగానే నిద్ర లేస్తారు. అప్పటి నుంచి అనేక వ్యాయామాలు, పనులు చేస్తుంటాడు. మధ్యమధ్యలో నీళ్లు సిప్ చేస్తూ కనిపిస్తుంటాడు. బాల్కనీలో నడవడం, పుష్-అప్‌లు చేయడం చేస్తుంటాడు. ఆ రోజు పనుల్ని డైరీలో నోట్ చేసుకోవడం వంటి పనులెన్నో ఉన్నాయి.
ఆ జాబితాలోనే.. ఐస్ క్యూబ్‌లు ఉన్న నీటి గిన్నెలో ముఖాన్ని కడగడం కూడా ఉంటుంది. చల్లని నీటిలో ముఖాన్ని ముంచి కొద్దిసేపు ఉంటాయి. ఆ తర్వాత.. ఓ అరటిపండు తింటాడు. ఆ పండు తొక్కతో తన ముఖాన్ని రుద్దుకుంటాడు. మళ్లీ తన ముఖాన్ని ఒక గిన్నె ఐస్ క్యూబ్ నీళ్ళులో ముంచుతాడు. ఈ మొత్తం వీడియోలో యూజర్లు.. అతని దినచర్య కంటే కూడా… అతను సిప్ చేసిన వాటర్ బాటిల్, ఐస్ క్యూబ్ నీటిలో ముఖాన్ని ముంచిన నీటిని చూశారు.
అంతే.. సోషల్ మీడియా యూజర్లు చేసినట్లుగానే ఆన్ లైన్లోని షాపింగ్ కార్ట్‌లో ఉన్న వాటర్ బాటిల్, అరటిపండ్ల ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లపైకి ఎక్కేశాయి. వేలాది లైకులతో దూసుకుపోయింది. నీటిలో ముంచిన ఐస్ క్యూబ్‌ల మరొక చిత్రం ఐదు మిలియన్లకు పైగా ప్రజలను ఆకట్టుకుంది.
సరటోగా నీరు
హాల్ తన వీడియోలో తాగే వాటర్ బాటిల్ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. సరటోగా బాటిల్ బ్రాండ్ నీరు ఇప్పుడు ఫేమస్ బ్రాండ్ గా మారిపోయింది. నవంబర్‌లో ప్రైమో వాటర్, బ్లూట్రైటన్ బ్రాండ్స్ విలీనం ముగిసిన తర్వాత ఉద్భవించిన కంపెనీ ప్రైమో బ్రాండ్స్. నీలి రంగు బాటిల్ లో ఉన్న నీరు అదే. ఆష్టన్ వీడియో తర్వాతా ఈ నీటి వినియోగం భారీగా పెరిగిపోయింది. గతంలో కంటే కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయి.
ఆష్టన్ హాల్
ఇతను ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. ఆష్టన్ హాల్ సోషల్ మీడియా ఖాతాలకు విపరీతంగా ఫాలోవర్లు ఉన్నారు. ఎన్నో ఫిట్ సెన్ విషయాలు తెలిపే.. ఇతని యూట్యూబ్ ఛానెల్ కు దాదాపు 3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్, తన జిమ్ రొటీన్‌లు, అతను అలా కండరు తిరిగిన శరీరం కోసం ఎలా వ్యాయామాలు చేస్తాడు అనే విషయాల్ని డాక్యుమెంట్ చేస్తుంటాడు. HIIT, నో-ఎక్విప్‌మెంట్ వర్కౌట్‌లు, అప్పర్ బాడీ వర్కౌట్‌లు, అబ్స్ వర్కౌట్, షోల్డర్ వ్యాయామాలు, లెగ్ డేస్, ఫుల్ బాడీ డంబెల్ వర్కౌట్‌లు వంటివి అనేకం ఉంటుంటాయి.
Also Read : Bengaluru Interview: ఇంటర్వ్యూలో 5వ తరగతి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన అభ్యర్థులు.. జెన్ z ఇంతేనా?