BigTV English

OTT Movie : పడుకున్న శవాన్ని లేపి మరీ తన్నించుకునే ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హారర్ మూవీ

OTT Movie : పడుకున్న శవాన్ని లేపి మరీ తన్నించుకునే ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హారర్ మూవీ

OTT Movie : ఓటీటీలో ఒక కొరియన్ హారర్-మిస్టరీ మూవీ టాప్ లేపుతోంది. ఈ సినిమా 2024లో దక్షిణ కొరియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా $97.6 మిలియన్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ఇప్పుడు కూడా ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కొరియన్ హారర్-మిస్టరీ మూవీ పేరు ‘ఎక్స్‌హ్యూమా’ (exhuma). 2024 లో వచ్చిన ఈ సినిమాకి జాంగ్ జే-హ్యూన్ దర్శకత్వం వహించారు. ఇందులో చోయ్ మిన్-సిక్, కిమ్ గో-యున్, యూ హే-జిన్, లీ డో-హ్యూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక శక్తివంతమైన సమాధి తవ్వడం తర్వాత వచ్చే భయంకరమైన పరిణామాల చుట్టూ తిరుగుతుంది.  IMDB లో ఈసినిమాకి 6.9/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ లాస్ ఏంజిల్స్‌లో నివసించే ఒక పార్క్ జి-యాంగ్ అనే సంపన్న కొరియన్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటాడు. వైద్యులు కూడా ఆ బిడ్డ రోగాన్ని నయం చేయలేక పోతారు. వాళ్ళు ప్రముఖ కొరియన్ షమన్ హ్వా-రిమ్, ఆమె శిష్యుడు బాంగ్-గిల్ ని కలుస్తారు. హ్వా-రిమ్ ఈ సమస్యను “గ్రేవ్స్ కాల్” అని గుర్తిస్తుంది. ఇది ఒక కోరికలు తీరని బంధువు ఆత్మ వల్ల వచ్చిన శాపంగా ఆమె గుర్తిస్తుంది. ఈ శాపాన్ని తొలగించడానికి, వాళ్ళు అనుభవజ్ఞుడైన కిమ్ సాంగ్-డియోక్, అతని క్రైస్తవ ఆచారాన్ని పాటించే యోంగ్-గియున్ సహాయం తీసుకుంటారు. జి-యాంగ్ ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో, ఒక పర్వతంపై ఉన్న తన తాత సమాధిని తవ్వాలని కోరుతాడు. సాంగ్-డియోక్ ఆ సమాధి స్థలం చుట్టూ ఒక భయంకరమైన శక్తిని చూస్తాడు. దానిని తవ్వడం ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. డబ్బుఆశతో ఈ పని చేయడానికి అతను ఒప్పుకుంటాడు.

హ్వా-రిమ్, బాంగ్-గిల్ ఒక సాంప్రదాయ కొరియన్ షమనిక్ రిచ్యువల్, “ఆక్స్ టర్నింగ్” ని నిర్వహిస్తారు. ఇందులో ఐదు పందులు, ఐదు కార్మికులు ఉంటారు. ఈ రిచ్యువల్ దుష్ట శక్తులను అడ్డుకుని, తవ్వకం సజావుగా సాగేలా చేస్తుంది. వీళ్ళు అక్కడ ఒక సైప్రస్ సమాధిని కనిపెడతారు. ఇది రాజ కుటుంబాలకు చెందినదిగా తెలుస్తుంది. అయితే తవ్వకం సమయంలో, ఒక కార్మికుడు పామును చంపడంతో, వర్షం కురవడం మొదలవుతుంది. ఇది చెడు శకునంగా అందరూ భావించి, పనిని వాయిదా వేస్తారు. సమాధి సమీపంలోని ఒక వార్డులో నిల్వ చేస్తారు. ఒక స్థానిక కస్టోడియన్, సమాధిలో నిధి ఉందనే పుకార్లతో ఆశపడి , సమాధిని తెరిచి ఒక ప్రతీకార ఆత్మను బయటికి వచ్చేలా చేస్తాడు. ఆ తరువాత భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. చివరికి ఆ సమాధి ఎవరిది ? ఎందుకు ప్రతీకారంతో ఉంటుంది ? దానివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి ? ఆ చిన్న శిశువు ఆరోగ్యం నయం అవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : 8 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ ఉన్న 11 మంది… ఒకే ఇంట్లో ఒకేసారి ఆత్మహత్య… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

Big Stories

×