OTT Movie : ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్, ఓటీటీలో మంచి వ్యూస్ తో నడుస్తోంది. 2018 జూన్ 30న, ఢిల్లీలోని బురారీలోని చుండావత్ అనే మధ్యతరగతి కుటుంబంలో, 11 మంది తమ ఇంట్లో చనిపోయి ఉంటారు. 10 మంది వ్యక్తులు పైకప్పుకు ఉరితాళ్లతో వేలాడుతూ ఉంటారు. వాళ్ళ కళ్ళకు బ్లైండ్‌ఫోల్డ్‌లు కట్టి ఉంటాయి. ఒక వృద్ధ మహిళ మంచంపై చనిపోయిన స్థితిలో ఉంటుంది. ఈ సంఘటన భారతదేశంలో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ కుటుంబం ఆర్థికంగా కూడా బాగేనే ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది ? ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ‘House of Secrets: The Burari Deaths’ 2021లో వచ్చిన ఈ సిరీస్ కు అనుభవ్ చోప్రా దర్శకత్వం వహించారు. మూడు ఎపిసోడ్‌లతో, ఈ డాక్యుమెంటరీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది. A.R. రెహమాన్ దీనికి సంగీతం అందించారు. IMDb లో ఈ సిరీస్ కి 7.4/10 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ 2018లో ఢిల్లీలోని బురారీలో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ స్టోరీ చుండావత్ అనే కుటుంబంలో జరిగిన 11 మంది హత్యల చుట్టూ తిరుగుతుంది.
ఎపిసోడ్ 1: ‘ది డే ఆఫ్ డెత్స్’
ఈ ఎపిసోడ్ లో చుండావత్ కుటుంబం, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంగా సంతోషంగా కనిపిస్తుంది. వీళ్ళు ఒక కిరాణా దుకాణం, ప్లైవుడ్ వ్యాపారాన్ని నడుపుతుంటారు. ఒక రోజు పొద్దున్నే ఇంటి తలుపు తెరిచి ఉండటం పక్కింటి వాళ్ళు గమనిస్తారు. ఏ అలికిడీ లేకపోవడంతో, అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ 10 మంది ఉరితాళ్లతో వేలాడుతూ ఉంటారు. 77 ఏళ్ల వృద్ధ మహిళ మంచంపై చనిపోయి ఉంటుంది. ఈ సంఘటనను ముందుగా హత్యగా భావిస్తారు. కానీ ఇంట్లో కనిపించిన 11 డైరీలు, ఇతర సాక్ష్యాలు ఒక సీక్రెట్ ను బయటపెడతాయి.
ఎపిసోడ్ 2: ‘ది డైరీస్’
ఈ ఎపిసోడ్ కుటుంబ జీవితంపై దృష్టి సారిస్తుంది. ఇంట్లో ఉన్న 11 డైరీలు, కుటుంబ సభ్యుడు లలిత్ చుండావత్ రాసినవి. ఇందులో ఒక ఆధ్యాత్మిక ఆచారం గురించి రాసి ఉంటుంది. లలిత్ తన తండ్రి మరణం తర్వాత మానసికంగా బాధపడుతూ, తన తండ్రి ఆత్మ తనతో మాట్లాడుతోందని నమ్ముతుంటాడు. అతను తన కుటుంబాన్ని ఒక “బాద్ కి జాత్” అనే ఆధ్యాత్మిక ఆచారంలో పాల్గొనమని ఆదేశిస్తాడు. ఈ క్రమంలో మోక్షం కోసం ఈ ఆత్మ హత్యలు చేసుకుంటారు.
ఎపిసోడ్ 3: ‘ది ఆఫ్టర్‌మాత్చివరి’
ఈ ఎపిసోడ్ లో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా ? ఎవరైనా హత్య చేశారా ? లేక ఒక ఆచారంలో భాగంగా జరిగిందా ? అనే ప్రశ్నలు వస్తాయి. ఈ సిరీస్ భారతీయ కుటుంబాలలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన లేకపోవడం, మూఢనమ్మకాలు, పురుషాధిక్యత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది.
Read Also : పేకాటలో భార్యను యజమానికి తాకట్టు పెట్టే పనోడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు మైండ్ బ్లాక్