E-Paper
Advertisement

Feel good Movie: మతిమరుపు తండ్రిని వదిలి అమెరికా వెళ్ళే కొడుకు… గుండెను పిండేసే ఎమోషనల్ డ్రామా

Feel good Movie: మతిమరుపు తండ్రిని వదిలి అమెరికా వెళ్ళే కొడుకు… గుండెను పిండేసే ఎమోషనల్ డ్రామా
Advertisement

Feel good Movie : ఒక అద్భుతమైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను మిస్ కాకుండా చూడండి. ఇది నేషనల్ అవార్డు గెలిచిన సినిమా కూడా. ఈ కథ తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధం చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో స్థిరపడిన కొడుకు, మతిమరుపుతో బాధపడుతున్న తన తండ్రిని చూడటానికి కోల్‌కతా రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇది ఫ్యామిలితో కలసి చూడాల్సిన చూడచక్కని సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ బెంగాలీ ఎమోషనల్ డ్రామా సినిమా పేరు ‘మయూరాక్షి’ (Mayurakshi). 2017లో వచ్చిన ఈ సినిమా అటాను ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో బెంగాలీ దిగ్గజ నటులు సౌమిత్ర ఛటర్జీ, ప్రోసేన్‌జిత్ ఛటర్జీ తండ్రీకొడుకులుగా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బెంగాలీ చలన చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను Hoichoi, prime video ప్లాట్‌ఫామ్స్‌లో చూడవచ్చు

స్టోరీ ఏమిటంటే

Advertisement

అర్యనీల్ (ప్రోసేన్‌జిత్) చికాగోలో స్థిరపడి ఉంటాడు. తన 84 ఏళ్ల తండ్రి సుశోవన్ (సౌమిత్ర ఛటర్జీ) ఆరోగ్యం బాగోలేదని తెలిసి కోల్‌కతా వస్తాడు. సుశోవన్ ఒక రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్. కానీ ప్రస్తుతం ఆయన మతిమరుపు వంటి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంటారు. అర్యనీల్ తన తండ్రితో గడిపే సమయం, తండ్రి గతాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడే మాటలు, వాళ్ళ మధ్య ఉండే పాత జ్ఞాపకాలు మనసుకు హత్తుకుంటాయి. ఈ ప్రయాణంలో తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ గ్యాప్‌ను దర్శకుడు చాలా సహజంగా చూపించారు.

అర్యనీల్‌కు కూడా తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ తన తండ్రి అమాయకత్వాన్ని, ఆయన మానసిక స్థితిని చూసినప్పుడు అతనికి జీవితం పట్ల కొత్త అవగాహన వస్తుంది. ఇది ఇలా ఉంటే, తండ్రి తన పాత స్నేహితురాలు ‘మయూరాక్షి’ గురించి అడుగుతుంటే, కొడుకు ఆమెను వెతికే ప్రయత్నం చేయడంతో సినిమా ఆసక్తికర మలుపు తీసుకుంటుంది. చివరికి మయూరాక్షిని అర్యనీల్ కనిపెడతాడా ? చివరి రోజుల్లో తండ్రికి తోడుగా ఉంటాడా ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తలుసుకోండి.

Advertisement

Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×