Summer Hill Stations: దక్షిణాదిలో ఉన్న మరికొన్ని హిల్ స్టేషన్లలో అత్యంత ప్రధానమైనది కూనూరు. చీకటి సొరంగాలు, లోయలు, టీ ఎస్టేట్లు..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి అందాలు ఎన్నో..ఎన్నెన్నో. ఇక, తూర్పు కనుమల్లో ఉన్న మరో బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఏర్కాడ్. వ్యూపాయింట్ నుంచి ప్రకృతి అందాలను చూడడం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.
ఊటీ ట్రిప్‌లో మీకు కన్పించే మరో బ్యూటిఫుల్ సమ్మర్ టూరిస్ట్ డెస్టినేషన్ కూనూరు. నీలగిరి పర్వతాల్లో ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక ఎండా కాలంలోనైతే చెప్పేదేముంది.. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రదేశం. అందుకే టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారిపోయింది. స్పాట్…
అన్నట్లు.. మెట్టుపాళ్యం.. ఊటీ మధ్యలో నడిచే టాయ్ ట్రైన్ ఈ కూనూరు మీదుగా వెళుతుంది. ఈ క్రమంలో దారి పొడవునా ఎన్నో అందాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి. విభిన్న పక్షి, జంతు జాతులు ఇక్కడ మైమరపింప చేస్తాయి. ఇంత అద్భుతంగా కన్పించే ఈ ప్రదేశమే గ్రీన్ వ్యాలీ. స్పాట్…
జపనీయుల శైలిలో నిర్మించి బొటానికల్ గార్డెట్ మరో ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్. ఇక్కడ వెయ్యికి పైగా మొక్కల జాతులు కన్పిస్తాయి. ఇక్కడి అందమైన సరస్సులు, వందల ఏళ్ల నాటి చెట్లు ప్రతి క్షణం మిమ్ములను ఆప్యాయంగా పలకరిస్తుంటాయి. చల్లటి గాలులతో మిమ్మల్ని సేదతీరేలా చేస్తాయి.
కూనూరులో కన్పించే మరికొన్ని పర్యాటక ప్రదేశాల విషయానికి వస్తే.. దుర్గ్ ఫోర్ట్, కటారి ఫాల్స్, సెయింట్ జార్జి చర్చి, డాల్ఫిన్స్ నోస్ వంటివి చాలా ఉన్నాయి.
తూర్పు కనుమల్లోని సర్వారాయ కొండల్లో సముద్ర మట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న మరో టూరిస్ట్ అట్రాక్షన్ ఏర్కాడ్. చుట్టూ దట్టమైన, ఎత్తైన అడవిలో యూ ఆకారంలోని వంపుల్లో ప్రయాణిస్తూ వెళ్లడం ఇక్కడ ఓ థ్రిల్ ఇస్తుంది. ఇదే ఇక్కడి ప్రధానమైన పర్యాటక ప్రాంతం. స్పాట్…
కొండ ప్రాంతం కావడం, వేసవిలోనూ చల్లగా ఉండడంతో ఇక్కడ ప్రధానంగా కాఫీ, నారింజ, పనస, జామ, యాలకులు, మిరియాల తోటలు ఎక్కువగా కన్పిస్తాయి. ట్రెక్కింగ్ చేసే వాళ్లకూ ఏర్కాడ్ ప్రాంతం ఓ ఫేవరెట్ డెస్టినేషన్ అనే చెప్పాలి. మే నెలలో ఈ ప్రాంతంలో మరింత సందడి వాతావరణం కన్పిస్తుంది. పడవల పోటీలు, పూల ప్రదర్శనలు, డాగ్ షో, ఏర్కాడ్ ఉత్సవాలతో ఈ ప్రదేశం అత్యంత సుందరంగా, రమణీయంగా కన్పిస్తుంది.
ఏర్కాడ్‌లో మరో టూరిస్ట్ పాయింట్ కొండ రాళ్లతో సహజంగా ఏర్పడిన ఆర్థర్ సీట్స్. ఇక్కడి వ్యూ పాయింట్స్‌లో కూర్చొని చూస్తే పచ్చని ప్రకృతి అందాలు మన కళ్లకు దగ్గరగా కన్పించి మనసును హత్తుకునేలా చేస్తాయి. ఇక్కడి ప్రదేశాలను చూసేందుకు టెలిస్కోపును సైతం ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇక్కడి నుంచి మెట్టూరు డ్యామ్, కావేరీ నది అందాలు చూస్తే కలిగే ఆ ఆనందమే వేరని చెప్పాలి.
Also Read: Mystery web Series : చిన్న వయసులోనే మిస్సింగ్…12 ఏళ్ల తర్వాత ఇంటికి… ఫ్యూజులు అవుట్ అయ్యే సస్పెన్స్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా.. అన్నాపార్క్, కిలియూర్ జలపాతం అద్భుతంగా కన్పిస్తాయి. 30 రకాల అరుదైన ఆర్కిడ్ పూలకు ఈ ప్రాంతం పెట్టంది పేరు. ఇక, పన్నెండు సంవత్సరాలకు ఓసారి విరిసే కురింజి పూల అందాలు మిమ్ములను ఎక్కడికో తీసుకెళ్తాయి.