E-Paper
Advertisement

దుర్మార్గుడైన మేనేజర్‌ను మార్చడానికి పదే పదే టైమ్ లూప్ లోకి… ఈ సిరీస్ ను చూస్తే నవ్వాపుకోలేరు

దుర్మార్గుడైన మేనేజర్‌ను మార్చడానికి పదే పదే టైమ్ లూప్ లోకి… ఈ సిరీస్ ను చూస్తే నవ్వాపుకోలేరు
Advertisement

Korean Rmantic Comedy: ఆఫీసులో కొంతమంది మేనేజర్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు అంటే… వాళ్ళ వల్ల జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. ఎప్పుడూ కసురుకుంటూ, చిరాకు పడుతూ ఎంప్లాయీస్ కి పెద్ద తలనొప్పిగా మారతారు. ఇలాంటి వాళ్ళను మార్చాలని ఎవరైనా అనుకుంటే ఎలా ఉంటుంది ? ఒక్కసారి మార్చలేకపోతే మళ్లీ మళ్లీ ట్రై చేస్తే… అందుకోసం ఏకంగా టైమ్ లూప్ లోకి వెళ్లిపోతే ? వినడానికి వింతగా ఉన్నా కూడా ఇలాంటి స్టోరీలైన్ తోనే ఓ కొరియన్ సిరీస్ ను తెరపైకి తీసుకొచ్చారు మేకర్స్. 2018లో విడుదలైన ఆ సౌత్ కొరియన్ వర్క్‌ప్లేస్ ఫాంటసీ, రొమాంటిక్ కామెడీ సిరీసే ‘ఫీల్ గుడ్ టు డై’ (Feel Good to Die). ఆఫీస్ జీవితంలో ఉండే నిజమైన బాధలు, బాస్-ఉద్యోగిని సంబంధాలు, కామెడీ, టైమ్ లూప్ వంటి ఎలిమెంట్స్ ను కలిపి ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కథలోకి వెళ్తే…

ఇప్పటిదాకా టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు, సిరీస్ లు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సిరీస్ మాత్రం ఒక వింతైన టైమ్ లూప్ కాన్సెప్ట్‌ తో నడుస్తుంది. బేక్ జిన్-సాంగ్ ఒక కంపెనీలో మార్కెటింగ్ టీమ్ మేనేజర్ గా వర్క్ చేస్తాడు. అతను విపరీతమైన అహంకారి, నోటి దురుసు ఉన్న వ్యక్తి. తన దగ్గర పని చేసే ఉద్యోగులను కించపరుస్తూ, ప్రతిరోజూ నరకం చూపిస్తుంటాడు. కంపెనీలో అందరికీ ఇతను చనిపోతే బాగుండు అనేంత కోపం ఉంటుంది.

Advertisement

లీ రూ-డా (బేక్ జిన్-హీ) అదే టీమ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసే ఉద్యోగిని. ఈవిడే సిరీస్ లో హీరోయిన్. మేనేజర్ జిన్-సాంగ్ పెట్టే టార్చర్‌ ను భరించలేక రోజూ మనసులోనే అతన్ని తిట్టుకుంటూ ఉంటుంది. నవంబర్ 7వ తేదీ రాత్రి కంపెనీ డిన్నర్ పార్టీ ఉంటుంది. ముగిసిన తర్వాత, మద్యం మత్తులో ఉన్న మేనేజర్ జిన్-సాంగ్ రోడ్డుపై వెళ్తూ ప్రమాదవశాత్తూ ఒక ట్రక్కు కింద పడి ఘోరంగా చనిపోతాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న రూ-డా, “నువ్వు చనిపోతే ఎంత బాగుండు!” అని మనసులో తీవ్రంగా అనుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం రూ-డా కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ అదే నవంబర్ 7వ తేదీ ఉదయం అవుతుంది. చనిపోయిన మేనేజర్ మళ్ళీ బతికే ఉంటాడు. విచిత్రం ఏమిటంటే, ఆ రోజంతా రూ-డాకు పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మేనేజర్ జిన్-సాంగ్ చావాలని కోరుకుంటే, అతను ఏదో ఒక ప్రమాదంలో చనిపోవడం, వెంటనే ఆ రోజు మొదటికి రావడం… అంటే టైమ్ లూప్ జరుగుతుంది.రూ-డా ఈ వింత లూప్ నుండి బయటపడాలంటే మేనేజర్ చనిపోకుండా కాపాడటమే ఏకైక మార్గమని గ్రహిస్తుంది.

Advertisement

అలాగే అతను చావకుండా ఉండాలంటే, ఇతరులు అతనిపై కోపపడకుండా అతని ప్రవర్తనను మార్చాలని డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో రూ-డా ఆ టైమ్ లూప్ సహాయంతో మేనేజర్ జిన్-సాంగ్ వెనుక ఉండి, అతని దురహంకారాన్ని, నైజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అతనికి బుద్ధి వచ్చేలా చేస్తూ, మంచి వ్యక్తిగా మారుస్తుంది.ఈ ప్రయాణంలో వారిద్దరి మధ్య తెలియకుండానే ఒక వింతైన బాండింగ్, ప్రేమ చిగురిస్తాయి. రూ-డా తన మేనేజర్‌ను మార్చి, తన జీవితాన్ని కూడా మార్చుకుంటుంది. అసలు ఆ టైమ్ లూప్ ఎందుకు ఏర్పడింది ? మేనేజర్ పూర్తిగా మారాడా ? చివరికి ఆ శాపం నుండి రూ-డా ఎలా బయటపడింది ? అనేది మిగిలిన కథ.

మొత్తం 32 ఎపిసోడ్‌లతో సాగే ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ 35 నిమిషాలు ఉంటుంది. ఆఫీస్ పాలిటిక్స్, ఫన్నీ టైమ్ లూప్ ఎలిమెంట్స్‌తో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ‘ఫీల్ గుడ్ టు డై’ ప్రస్తుతం యూట్యూబ్ లో, Mx Playerలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఉచితంగా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు, కానీ ఒరిజినల్ కొరియన్ వెర్షన్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్ ను వీక్షించవచ్చు.

Read Also: ఆటో డ్రైవరును కలవడానికెళ్తే అపరిచిత వ్యక్తి ఎంట్రీ… కట్ చేస్తే గుండె గుభేల్మన్పించే ట్విస్ట్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×