E-Paper
Advertisement

ఆటో డ్రైవరును కలవడానికెళ్తే అపరిచిత వ్యక్తి ఎంట్రీ… కట్ చేస్తే గుండె గుభేల్మన్పించే ట్విస్ట్

ఆటో డ్రైవరును కలవడానికెళ్తే అపరిచిత వ్యక్తి ఎంట్రీ… కట్ చేస్తే గుండె గుభేల్మన్పించే ట్విస్ట్
Advertisement

Malayalam Thriller: పెద్దగా పేరూ ఊరూ తెలియని వాళ్ళతో ప్రేమలో పడితే, ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చాలామంది అమాయకపు ఆడపిల్లలకు తెలియదు. అమాయకులం అనుకునే వాళ్ళే కాదు ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మలయాళం మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఆ సినిమా మరేంటో కాదు… 2020లో విడుదలైన మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘కప్పెల’ (Kappela). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

వయనాడ్‌ కు చెందిన జెస్సీ (అన్నా బెన్) అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి కథ ఇది. చదువు మధ్యలోనే ఆపేసిన ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. తల్లికి కుట్టుపనుల్లో సాయం చేస్తుంటుంది. ఒకరోజు పొరపాటున తాను రింగ్ చేసిన నెంబర్ ఒక రాంగ్ నెంబర్‌ కు కలుస్తుంది. ఆ ఫోన్ కాల్ కోజికోడ్‌ లో ఆటో నడుపుకునే విష్ణు (రోషన్ మాథ్యూ) అనే యువకుడికి వెళ్తుంది. ఆ ఫోన్ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ముందుగా ఆ రాంగ్ నెంబర్ పరిచయం వారిద్దరి మధ్య ఫోన్ స్నేహంగా ఉంటుంది.

Advertisement

ఒకరినొకరు చూసుకోకపోయినా, కేవలం మాటలతోనే ఇద్దరూ గాఢంగా ప్రేమలో పడతారు. మరోవైపు జెస్సీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఇలాంటి సమయంలో విష్ణుని కలవడానికి ఆమె ఇంట్లో చెప్పకుండా మొదటిసారి కోజికోడ్ నగరానికి బస్సు ఎక్కి ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. జెస్సీ సిటీకి రాగానే విష్ణు ఆమెను కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌ లో భోజనానికి వెళ్తారు. అదే సమయంలో రాయ్ (శ్రీనాథ్ భాసి) అనే ఒక అగ్రెసివ్, ముక్కుసూటి మనస్తత్వం గల యువకుడు అక్కడకు వెళ్తాడు.

రాయ్ నిజానికి ఉద్యోగం కోసం తిరుగుతుంటాడు. కానీ అతను ఆ పని వదిలేసి విష్ణు, జెస్సీలను ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. ఒక సందర్భంలో విష్ణు, రాయ్ మధ్య గొడవ షూరూ అవుతుంది. దీంతో రాయ్ ప్రవర్తన చూసి జెస్సీ వణికిపోతుంది. ప్రేక్షకులకు కూడా రాయ్ ఒక విలన్ లాగా, ఇంకా బాగా చెప్పలాంటే సైకో లాగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే విష్ణు జెస్సీని తీసుకుని ఒక లాడ్జికి వెళ్తాడు. అక్కడికి రాయ్ కూడా వెళ్తాడు. అక్కడ విష్ణు నిజ స్వరూపం బయట పడుతుంది. నిజానికి విష్ణు మామూలు ఆటో డ్రైవర్ కాదు, అతను అమాయకపు అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, వ్యభిచార ముఠాలకు అమ్మేసే ఒక పెద్ద క్రిమినల్ అనే షాకింగ్ నిజం తెలుస్తుంది.

Advertisement

జెస్సీని కూడా అదే లాడ్జిలో ఒక దళారికి అమ్మడానికి డీల్ మాట్లాడుకుంటాడు. ఇక్కడే రాయ్ నిజ స్వరూపం కూడా బయట పడుతుంది.
మరి ఇంతకీ రాయ్ ఎవరు ? అతను విష్ణుని ఏం చేశాడు ? అమాయకంగా ఆటో డ్రైవర్ ను నమ్మిన జెస్సీని ఎలా కాపాడతాడు ? అన్నది స్టోరీ. ‘కప్పెల’ అనే ఈ మలయాళం మూవీ Netflix లో ఉంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కావాలంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమాను తెలుగులో ‘బుట్టబొమ్మ’ (Butta Bomma – 2023) పేరుతో అధికారికంగా రీమేక్ చేశారు. ఆ రీమేక్ వెర్షన్ ప్రస్తుతం Netflix లోనే తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : సూపర్ హీరోలందరినీ చంపేసే క్రూరత్వం… మైండ్ బ్లోయింగ్ యానిమే సూపర్ హీరో సిరీస్

Tags

Related News

ఒక్క రాత్రి డేట్ అనుకున్నారు… కానీ కారు ఎక్కగానే నరకం మొదలైంది

దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ

ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

అడవిలో వీకెండ్‌కి వెళ్లిన అమ్మాయి… తెల్లారేసరికి వ్యాన్‌లో బందీ… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ

Big Stories

Advertisement
×