OTT Movie : ఓటీటీలో ఒక తమిళ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఆమ్మాయిలను మోసం చేసి, వాళ్ళ వీడియొలతో డబ్బులుసంపాదించే ఒక డాక్టర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. ఈ స్టోరీ చివరి వరకూ ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫైర్’ (Fire). 2025 లో విడుదలైన ఈ సినిమా JSK సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. JSK ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ కింద దీనిని నిర్మించారు. ఇందులో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరాసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్, గాయత్రి షాన్, సింగం పులి, మరియు సురేష్ చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించారు. సినిమాటోగ్రఫీని సతీష్ G. నిర్వహించగా, సంగీతం DK సమకూర్చారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14 న థియేటర్లలో విడుదలైంది. మార్చి 28 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), టెంట్ కొట్టా (Tentkotta) లలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సినిమా కాసి అనే ఫిజియోథెరపిస్ట్ మిస్టరీ డెత్ తో ప్రారంభమవుతుంది. అతన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి దారుణంగా చంపుతాడు. అతని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కథ ముందుకు సాగుతుంది. ఇన్‌స్పెక్టర్ సరవణన్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ కేసును దర్యాప్తు ప్రారంభమవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ కాసి జీవితంలోని చీకటి కోణం వెలుగులోకి తెస్తుంది. కాసి సామాజికంగా బాధ్యతాయుతమైన వ్యక్తిగా కనిపించే ఒక సోషియోపథ్, 100 మందికి పైగా మహిళలను మోసగించి, వారితో సన్నిహిత క్షణాలను రహస్యంగా రికార్డ్ చేసి, బ్లాక్‌మెయిల్ ద్వారా లక్షల రూపాయలు గడించాడు. పోలీసులు అతని ఫోన్‌లలో 1,900 అశ్లీల ఫోటోలు మరియు 400 వీడియోలను కనిపెడతారు. ఇవి అతని నేరాల చిట్టాని బయటపెడతాయి.
అతను తన మోసపూరిత మాటలతో, తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ తో ఈ పనులు చేస్తుంటాడు. మహిళల వీడియొలను రహస్యంగా రికార్డ్ చేసి, ఆ రికార్డింగ్‌లను బ్లాక్‌మెయిల్ కోసం ఉపయోగిస్తాడు. ఇదంతా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఒక షాకింగ్ ట్విస్ట్‌తో పిచ్చెక్కిస్తుంది. చివరికి కాసిని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? ఆ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలు ఆ అపార్ట్మెంట్లో అడుగు పెడితే నరకమే… రెంట్‌కి ఉండాలంటే ప్రాణాలు వదులకోవాలి