OTT Movie : ఓటీటీలో ఒక డిఫరెంట్ స్టోరీ కేక పెట్టిస్తోంది. ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ ఆత్మ ఒక అమ్మాయిలోకి వెళ్తుంది. ఆమె ఆత్మ సైకోలోకి వెళ్తుంది. ఇలా ఆత్మలు పరకాయప్రవేశం చేస్తాయి. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్ స్టార్ (Jio hotstar)లో
ఈ హారర్-కామెడీ మూవీ పేరు ‘ఫ్రీకీ’ (Freaky). 2020 లో వచ్చిన ఈ సినిమాకి క్రిస్టోఫర్ లాండన్ దర్శకత్వం వహించారు. ఇందులో విన్స్ వాన్ (బ్లిస్‌ఫీల్డ్ బుట్చర్) మరియు కాథరిన్ న్యూటన్ (మిల్లీ కెస్లర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఒక టీనేజ్ అమ్మాయి, ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. దీనిని బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించారు. ఇది 2020 నవంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. 1 గంట 42 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 6.3/10 రేటింగ్ ఉంది. జియో హాట్ స్టార్ (Jio hotstar)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
బ్లిస్‌ఫీల్డ్ అనే చిన్న పట్టణంలో, నలుగురు టీనేజర్లు సీరియల్ కిల్లర్ అయిన బ్లిస్‌ఫీల్డ్ బుట్చర్ గురించి మాట్లాడుకుంటూఉంటారు. అతను 1970ల నుండి హత్యలు చేస్తూ, ఇంతవరకూ పట్టుబడలేదని చెప్పుకుంటారు. అదే సమయంలో బుట్చర్ వీళ్ళు ఉన్న మాన్షన్‌లోకి చొరబడి, ఈ నలుగురు టీనేజర్లని కిరాతకంగా హత్య చేస్తాడు. ఇప్పుడు స్టోరీ మిల్లీ కెస్లర్ హైస్కూల్ అమ్మాయి దగ్గరికి వస్తుంది. ఆమె స్కూల్ లో ఉండే పాపులర్ గ్రూప్‌ల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె కు తండ్రి చనిపోవడంతో, తల్లి పౌలా మద్యంకు బానిస అవుతుంది. ఆమె అక్క చార్‌లీన్ ఒక పోలీసు అధికారిగా ఉంటూ , కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది. మిల్లీకి ఆమె స్నేహితులు నైలా, జోష్ మాత్రమే తోడుగా ఉంటారు. ఆమెకు బుకర్ అనే స్టూడెంట్ మీద క్రష్ ఉంటుంది.
ఒక రోజు రాత్రి మిల్లీ ఒంటరిగా ఉండటం చూసిన బుట్చర్ డాగర్‌తో ఆమెపై దాడి చేస్తాడు. అయితే ఆమె చనిపోవడానికి బదులు అక్కడ షాక్ అయ్యే సంఘటన జరుగుతుంది. డాగర మాయా శక్తి వల్ల వీళ్ళ శరీరాలు మారిపోతాయి. మిల్లీ బుట్చర్ శరీరంలోకి మిల్లీ ఆత్మ వెళ్తుంది. మిల్లీ శరీరంలో బుట్చర్ ప్రవేశిస్తాడు. 24 గంటల్లో శరీరాలను తిరిగి మార్చకపోతే, ఈ మార్పు శాశ్వతంగా అలాగే ఉంటుందని మిల్లీ తెలుసుకుంటుంది.మిల్లీ తన స్నేహితులు నైలా, జోష్‌ల సహాయంతో డాగర్‌ను తిరిగి పొంది, శరీర మార్పును రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు బుట్చర్ ఆమె అందమైన రూపాన్ని ఉపయోగించి హైస్కూల్‌లో హత్యలు చేస్తాడు. అతను మిల్లీ క్రష్ బుకర్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటాడు. చివరికి బుట్చర్ ని మిల్లీ ఎదుర్కుంటుందా ? వీళ్ళ శరీరాలు మళ్ళీ మామూలు స్థితికి వస్తాయా ? ఆ కిల్లర్ మిల్లీ క్రష్ ని ఏం చేస్తాడు. అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మూవీ డైరెక్టరే సైకో కిల్లర్ అయితే ? ఒక్కో సీన్ క్లైమాక్స్ లా… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్