Swetcha Suicide Case: ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ సంచలన లేఖ రాశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో తనను అనసరంగా ఇరికిస్తున్నారని చెప్పారు. తనకు సేచ్చకు అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవని లేఖలో చెప్పుకొచ్చారు. మీడియా ద్వారా అరణ్య పాప మాటలు తనను బాధించాయన్నారు పూర్ణచందర్.
తాను స్వేచ్ఛ, తన కూతురు అరణ్యలను బాగా చూసుకున్ననని చెప్పారు పూర్ణచందర్. స్వేఛ్ఛ జీవితంలో కొల్పోయిన ఆనందాన్ని ఇచ్చానన్నారు. ఏ రోజు ఆమె చావును కోరుకోలేదని చెప్పారు. ఈ కేసులో వారి అమ్మనాన్నలు, బంధువులు చేస్తున్న అరోపణలు అబద్ధమన్నారు. తాను ఏరోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదని.. ఒత్తిడి చేయలేదని చెప్పారు.
స్వేచ్ఛ మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో పోస్టుమార్టం పూర్తి అయ్యింది. యాంకర్ స్వేచ్ఛ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయిందంటున్నారు ఫోరెన్సిక్ వైద్యులు వెంకట్ నాగరాజు. మూడు నిమిషాల్లోనే మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. విస్రా శాంపిల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించామన్నారు. పోలీసులకు రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయి రిపోర్ట్ ఇస్తామంటున్నారు. మెడపై తప్ప మరెక్కడా కూడా గాయాలు లేవని అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట్ నాగరాజు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న యాంకర్ స్వేచ్ఛ కేసులో.. పూర్ణచందర్ నాయక్ పోలీసులకు లొంగిపోయాడు. నిన్న రాత్రి 11గంటలకు అడ్వకేట్ సమక్షంలో పూర్ణచందర్ నాయక్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచందర్ నాయక్ కారణమని స్వేచ్ఛ తండ్రి అన్నారు. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక.. పూర్ణచంద్రర్‌తో కలిసి ఉంటుందని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీళ్లద్దరి మధ్య గొడవలు ఉన్నాయని.. ఆ కారణంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
లొంగిపోయిన అనంతరం పూర్ణచందర్ మీడియాకు లేఖను విడుదల చేశారు. అందులో స్వేచ్ఛకు తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ఆమె కుటుంబ సభ్యుల తీరు వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఆమె తల్లిదండ్రులు చిన్ననాటి నుంచీ తనను ఒంటరిగా వదిలేశారని.. సరిగా పట్టించుకోలేదని స్వేచ్ఛ ఎన్నో సందర్భాలలో తన దగ్గర బాధ పడిందన్నారు.
తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ మృతిపై.. పలువురు ప్రముఖులు, అభిమానులు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆకస్మిక మరణం మీడియా వర్గాల్లోని ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది.
Also Read: అమ్మ నాతో చివరిగా చెప్పింది ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్వేచ్ఛ కూతురి మాటలు
స్వేచ్ఛ వృత్తిపట్ల నిబద్ధత గల వ్యక్తి. ఆమె మరణం మీడియా రంగానికి తీరనిలోటు. ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు బయటపడే వరకు మేము పోరాడతాం.. జర్నలిస్ట్ యూనియన్ నాయకులు తెలిపారు.