Friday OTT Releases: ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీలోని మూవీస్ ను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో సినిమాలు మిస్ అయ్యిన వారు ఇక్కడ సినిమాలు చూసేస్తున్నారు. పాత కొత్త సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. లవ్, కామెడీ, ఫ్యామిలీ, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ , క్రైమ్ జోనర్స్‌లో ప్రతి వారం వందలకొద్ది సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోకి కన్నప్ప వచ్చేసింది. ఈ మూవీ కోసం గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వివాదాలతో మొత్తానికి థియేటర్లలోకి వచ్చేసింది.. దీంతో పాటుగా అర డజనుకు పైగా సినిమాలు సందడి చేస్తున్నాయి.
అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విరాటపాలెం, ఒక పథకం ప్రకారం మూవీ టాలీవుడ్ ప్రియులకు అలరించేందకు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఒక్క రోజులోనే దాదాపు 12కు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం మూవీ లవర్స్ కోసం ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి..
స్క్విడ్ గేమ్ సీజన్ 3..
ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న స్క్విడ్ గేమ్ సిరీస్‌లో భాగంగా మూడో సీజన్ జూన్ 27న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.. లీ జుంగ్జే, లీ బైయాంగ్హున్, వీ హాజౌన్, ఇమ్ సివాన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
మిస్త్రీ..
ఈ స్టోరీ మొత్తం పోలీస్ అధికారి చుట్టు తిరుగుతుంది. మాజీ పోలీస్ అధికారికి ఓసీడీ సమస్యలు ఉండటంతో దర్యాప్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. ఈ సందర్భంగా చోటు చేసుకునే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. ఇది మొత్తం పోలీస్, డీటేక్టివ్ ల చుట్టు తిరుగుతుంది.రామ్ కపూర్, శిఖా తలసానియా, మోనా సింగ్, అభిజిత్ ఛిత్రే తదితరులు ఇందులోనటించారు.. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది. మరికొన్ని సినిమాలు వచ్చేసాయి.
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ..
స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ..
క్లీనర్- జూన్ 27
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ..
స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 27
పొకేమాన్ హారిజన్స్- సీజన్-2 – జూన్ 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ..
మిస్త్రీ (హిందీ సిరీస్) – జూన్ 27
జీ5 ఓటీటీ..
విరాటపాలెం (తెలుగు సిరీస్) – జూన్ 27
బిబీషణ్ (బెంగాలీ సిరీస్) – జూన్ 27
అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) – జూన్ 28
సన్ నెక్స్ట్ ఓటీటీ..
అజాదీ (తమిళ సినిమా) – జూన్ 27
ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) – జూన్ 27
ఆప్ కైసే హో- జూన్ 27
నిమ్మ వస్తుగలిగే నీవే జవాబ్దారు(కన్నడ సినిమా)- జూన్ 27
ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలోకి వచ్చి మంచి వ్యూస్ ని రాబడుతున్నాయి… ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైన జూన్ చివరివారం సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి.