OTT Movie : ఓటీటీలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ దుమ్ము దులుపుతోంది. ఈ సినిమాలో గుండె గుభేల్ మనిపించే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇది కొరియెన్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో కూతురి కోసం ఒక తండ్రి ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తాడు. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా ఒక విందు భోజనంలా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో
ఈ కొరియెన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్’ (Deliver us from evil). 2020 లో వచ్చిన ఈ సినిమాకి హాంగ్ వాన్-చాన్ దర్శకత్వం వహించారు. ఇందులో హ్వాంగ్ జంగ్-మిన్, లీ జంగ్-జే, పార్క్ జియాంగ్-మిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 108 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.8/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఇన్-నామ్ నైపుణ్యం గల ఒక పోలీస్ అధికారి. జపాన్‌లో ఒక గ్యాంగ్ స్టర్ అయిన కోరియోడాను చంపాడానికి ఒక మిషన్ లో ఉంటాడు. అతన్ని చంపిన తర్వాత రిటైర్ కావాలనుకుంటాడు. అనుకున్నట్టే ఒక రోజు ఆ గ్యాంగ్ స్టర్ ను అంతం చేస్తాడు. ఆ తరువాత అతని మాజీ ప్రేయసి యంగ్-జూ, తన 9 ఏళ్ల కూతురు యూ-మిన్ థాయిలాండ్‌లో కిడ్నాప్ అయిందని ఇన్-నామ్ ను సహాయం కోరుతుంది. వీళ్ళు ఒకప్పుడు కలసి ఉండేవాళ్లు,కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉంటారు. ఇప్పుడు తన కూతురు కోసం ఇతను బ్యాంకాక్‌కు వెళ్తాడు. అదే సమయంలో, చంపబడిన గ్యాంగ్ స్టర్ సోదరుడు రే , ప్రతీకారం కోసం ఇన్-నామ్‌ను వెంటాడుతాడు. రే, ఒక క్రూరమైన హంతకుడు. ఎన్నో హత్యలు చేసి ఒక సైకోలా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు ఇన్-నామ్ ను చంపడం కోసం థాయిలాండ్ వస్తాడు.
మరో వైపు బ్యాంకాక్ లో ఒక ట్రాన్స్‌జెండర్ యుయ్ సహకారంతో, యూ-మిన్‌ను రక్షించేందుకు ఇన్-నామ్ ప్రయత్నిస్తాడు . అతను అక్కడ ఒక భయంకరమైన చావోపో గ్యాంగ్‌తో తీవ్రంగా పోరాడుతాడు. ఈ యాక్షన్ సన్నివేశాలలో కత్తి ఫైట్‌లు, దిమ్మతిరిగే గన్‌ఫైట్‌లు ఉంటాయి. ఈ క్రమంలో యంగ్-జూ హత్యకు గురైనట్లు, యూ-మిన్‌ను ఆర్గాన్ ట్రాఫికింగ్ రింగ్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ తారాస్థాయికి చేరుతుంది. చివరికి ఇన్-నామ్ తన కూతుర్ని కాపాడుకుంటాడా ? రే తన ప్రతీకారం తీర్చుకుంటాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియెన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మొగుడు ఉండగానే పనివాడితో భార్య రాసలీలలు… చివర్లో బాహుబలి రేంజ్ ట్విస్ట్