OTT Movie : థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్విస్ట్ లతో అదరగొడుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
బెంగే (Binge) లో
ఈ బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు’ఫ్రైడే’ (Friday). 2023 లో విడుదలైన ఈ సిరీస్ కు రైహాన్ రఫీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో తోమా మీర్జా, నసీర్ ఉద్దీన్ ఖాన్ నటించారు. ఇది నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన స్టోరీ. ఇందులో ఒక మహిళ 999కి కాల్ చేసి, సహాయం కోసం కాకుండా పోలీసులకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె అలా చేయడానికి గల కారణం ఏమిటనేది కథ లో అసలైన ట్విస్ట్. ఈ వెబ్ సిరీస్ మార్చి 1, 2023న ఓటీటీ ప్లాట్ ఫామ్ Binge లో విడుదలైంది. దీని రన్‌టైమ్ 1 గంట 22 నిమిషాలు. ‘Friday’ సిరీస్‌కి సంబంధించిన స్టోరీ ‘Parasite’, ‘House of Secrets: The Burari Deaths’ నుండి కాపీ చేయబడిందని విమర్శలు కూడా వచ్చాయి.అయితే మీరు దీన్ని Binge వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు.
స్టోరీలోకి వెళితే
ఫ్రైడే సినిమా నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ స్టోరీ మునా అనే మహిళ చుట్టూ తిరుగుతుంది.ఆమె సహాయం కోరడానికి కాకుండా, పోలీసులకు లొంగిపోవడానికి 999 కి కాల్ చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఈ స్టోరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఆమె ఈ కఠినమైన నిర్ణయం ఎందుకు చేసిందో పోలీసులకు చెప్తుంది. ఐదుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబం పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటుంది. కానీ పరిస్థితులు భయంకరమైన మలుపు తీసుకుంటాయి. మునా తన తల్లిదండ్రులు, చెల్లెలి కి ఆహారంలో నిద్ర మాత్రలు వేసి చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన భర్త పోకత్‌ను కూడా క్రూరంగా హింసిస్తుంది. స్టోరీ గతంలోకి వెళ్తుంది. మునా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తండ్రి ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు. ఆమె తల్లి మునా ను కష్టపడి పెంచుతుంది.
ఎవరూ దిక్కులేక పోకత్‌నుపెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమెతో అంత సంతోషం గా ఉండడు పోకత్. ఆమె చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆమెకు కావాల్సినవి కొనిస్తూ ఉండటంతో, ఆమె కూడా వీడికి కావాల్సింది ఇస్తూ ఉంటుంది. పద్దతి మార్చుకోమని భర్తకి చెప్తుంది. అయితే అతను మాత్రం నిన్ను చూస్తే నాకు మూడ్ రావట్లేదని, అందుకే ఇలా చేస్తున్నానని చెప్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత తండ్రి తిరిగి వస్తాడు. ఇప్పుడొచ్చి పెత్తనం చేస్తుంటాడు తండ్రి. జీవితంలో విసిగిపోయి భర్త ను చంపాలని చూస్తుంది. చివరికి ఆమె తన భర్తను చంపుతుందా ? తన తల్లిదండ్రులకు కూడా నిద్రమాత్రాలు ఇవ్వడానికి కారణం ఏమిటి ? ఈ విషయాలు ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.
Also Read : బట్టల షోరూమ్ లో ఉన్న బొమ్మలు ఇంత డేంజరా ? క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ