Gundeninda GudiGantalu Today episode April 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ కు బిజినెస్ పెట్టించాలనే ప్లాన్ బయట పెట్టేస్తారు ప్రభావతి మనోజ్.. బాలు మాత్రం మనోజ్ కి జాబ్ లేదని సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. బిజినెస్ పెట్టించాలనే కోరిక ఉంది మీరు కొంచెం సాయం చేస్తే బిజినెస్ చేస్తానని మనోజ్. రోహిణి వాళ్ళ నాన్నకు పెద్ద బిజినెస్ మాన్.. తల్లి చనిపోయిందని రోహిణి తో అనగానే బ్రతికున్న తల్లిని చంపేస్తున్నా అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. మళ్లీ లోపలికి వచ్చిన రోహిణి మీ అమ్మ కోసం బాధపడ వద్దని అందరు అంటారు. బయటకొచ్చి మళ్ళీ రోహిణి బాధపడుతూ ఉంటే ప్రభావతి మీనా శృతి సుశీల అందరూ బాధపడవద్దని ఓదారుస్తారు. మరోవైపు రోహిణి వాళ్ళ మామ ఖచ్చితంగా మలేషియా నుంచి రాలేదని బాలు ఈ నిజాన్ని ఎలాగైనా బయటపెట్టించాలని ప్లాన్ వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఊరిని చూసి రావాలని బాలు రాజేష్ ఇద్దరు అనుకుంటారు.. ఊరిని చూడక చాలా రోజులైంది పల్లెలు ఉంటే నాకు కూడా చాలా ఇష్టం వెళ్లి చూసొద్దాం పదండి అని మాణిక్యం అంటాడు. రోహిణి మాత్రం బాలుతో వెళ్తున్నాడు కచ్చితంగా నిజాలు బయట పెడతాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మావయ్య నువ్వు బాగా అలసిపోయావు కదా వెళ్లి పడుకుందువు రా అనేసి అంటుంది. ఎంతసేపు ఏం పడుకుంటావమ్మా కాసేపు అలా ఊరు తిరిగేస్తామని అనగానే రోహిణి వద్దు అంటుంది. లేదు నేను వెళ్లాల్సిందే అని మాణిక్యం అనడంతో మనోజ్ నీ తోడుగా పంపిస్తుంది.
బాలు రాజేష్ అందరూ మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. ఒకచోట ఆగి రాజేష్ ఫారిన్ సర్కుందానే అడుగుతాడు. కస్టమ్స్ అధికారులు పట్టేసుకున్నారని ఏదో అబద్దాలు చెప్పేస్తాడు. ఇక ఈ ఊర్లో కళ్ళు ఉంటుందని అడిగితే ఈ ఊర్లో చాలా ఉంటుంది మీకు ఎంత కావాలో అంత తాగొచ్చు అని బాలు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అరేంజ్ చేయమని చెప్తాడు. ఇక అందరూ అక్కడికి వెళ్తారు మనోజ్ మాత్రం మాణిక్యం నీ తాగకుండా ఆపుతాడు. నేను తిడుతుంది అంకుల్ మీరు ఇలా చేస్తే అని ఎంత చెప్పినా మాణిక్యం మాత్రం వినకుండా కుండలు కుండలు కల్లు తాగిస్తారు.
ఇక మాణిక్యం మనోజ్ తో కుడా కల్లు తాగించాలని అనుకుంటాడు. బాలు రాజేష్ వాళ్ళు ఎంత వద్దని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా మనోజ్ చేత కళ్ళు తాగిస్తాడు. ఇక మనోజ్ నా కళ్ళు తిరుగుతున్నాయి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతాడు. కల్లు తాగినప్పుడు మనోజ్ కి మత్తుగా ఉండడంతో దారిలో ఒకచోట పడిపోతాడు. ఇక బాలు మాణిక్యంతో అసలు నిజం చెప్పించాలని అనుకుంటాడు. మెల్లగా మాణిక్యంతో మలేషియాలో ఎక్కడుంటారు? ఏ పని చేస్తారు? మీ బిజినెస్ లు ఏంటి? అని అడుగుతారు. దానికి నేను ఎక్కడ ఉంటానో తెలుసా నేను ఏం చేస్తానో తెలుసా అని అంటాడు. మాది మలేషియాలో పెద్ద బిజినెస్ అని చెప్పి కింద పడిపోతాడు.
నిజం చెప్పేవాడు అనవసరంగా పడిపోయాడు వీడిచేత నిజం ఎలా చెప్పించాలి అసలు వీడు మలేషియా నుంచే రాలేదని నాకు అర్థం అయిపోయిందని బాలు రాజేష్ తో అంటాడు. పోనీలేరా ఇంకొకసారి నిజం చేపిద్దామని వాళ్ళందరూ మాణిక్యం ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. మధ్యలో మనోజ్ పడిపోవడం చూసి బాలు షాక్ అవుతాడు. ఇంట్లో నాకు రూమ్ కావాలి రూమ్ కావాలి అన్నాడు ఇక్కడ చూడండి నడి రోడ్డు మీద బెడ్ పై పడుకున్నట్టు ఎలా పడుకున్నాడు అని అంటాడు.
మనోజ్ నీ లేపడానికి ప్రయత్నం చేస్తాడు బాలు. కానీ మనోజ్ మాత్రం నేను లేవను నేను ఇక్కడే పడుకుంటానని కింద పడిపోతాడు. మాణిక్యం ఎవరి వ్యక్తి ఫుల్లుగా తాగిన పడిపోయాడు అని అడిగితే మీ పాపను పెళ్లి చేసుకున్న మొగుడు అనేసి బాలు అంటాడు. ఏంటి ఇలా పడిపోయాడు అని మాణిక్యం అడుగుతాడు. తమరు చేసిన పనికి ఇలానే జరుగుతది. ఇప్పుడు వీన్నిలా ఇంటికి తీసుకెళ్తే అందరూ నాదే తప్పు నేనే చేశాను అని అంటారు. నువ్వు మాత్రం నిజం ఒప్పుకోలేదు అనుకో ఆ తర్వాత నీ పని నేను చెప్తానని బాలు వార్నింగ్ ఇచ్చి మరి ఇంటికి వెళ్తాడు.
అందరూ కలిసి అలా ఇంటికి వెళ్తారు మనోజ్ ని అక్కడ కూర్చోబెడతారు. ప్రభావతి ఏమైందిరా వాడికి సోయ లేకుండా ఉన్నాడేంటి అనిఅడుగుతుంది. తాగొచ్చారా అని అంటే కళ్ళు తాగాడని బాలు చెప్తాడు. వాన్ని కూడా నీలాగే తయారు చేస్తున్నావా అని ప్రభావతి అరుస్తుంది. రోహిణి నువ్వంటే ఎలాగో తాగి అందర్నీ బాధ పెడుతున్నావ్ ఇప్పుడు మనోజ్ ని కూడా తాగుబోతుని చేయాలనుకుంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. బాలు మాత్రం మౌనంగా ఉంటాడు. మేక మావయ్య అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని మాణిక్యం ని అడిగితే, మాణిక్యం మాత్రం బాలుదే తప్పు.. మనజ్ వద్దని అన్నా బలవంతంగా తాగించాడని అడ్డంగా ఇరికిస్తాడు… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..