Brahmamudi serial today Episode: అప్పు, కళ్యాణ్ కలిసి కిందకు వస్తారు. అప్పు ఇంద్రాదేవికి నేను ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్తుంది. దీంతో అక్కడే ఉన్న స్వప్న కళ్యాణ్‌ను కూడా తీసుకెళ్తున్నావా..? అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్ నన్ను ఎందుకు తీసుకెళ్తుంది అని అడుగుతాడు. దీంతో అప్పు నిన్ను చూడాలనుకున్నప్పుడల్లా ఇంటికి రాలేదు కదా అందుకే ఆఫీసుకు తీసుకెళ్తుందేమో అంటుంది. దీంతో అలాంటిదేం లేదని కళ్యాణ్ చెప్తాడు. ఇద్దరూ ఆఫీసుకు వెళ్లిపోతారు. ఇంతలో కావ్య వచ్చి ఇంద్రాదేవికి సీతారామయ్య వేసుకునే టాబ్లెట్స్ గురించి డీటెయిల్స్ చెప్పి వెళ్లబోతుంటే.. రుద్రాణి వెటకారంగా ఈసారి ఏ రెస్టారెంట్‌కు వెళ్తున్నారో అమ్మగారు అంటుంది. దీంతో కావ్య నేరుగా ఆఫీసుకే వెళ్తున్నాను రుద్రాణి గారు. కష్టపడి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నాతో కారులోనే రావొచ్చు. పైగా వీడియోలు తీసుకునే అవసరమే రాదు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో స్వప్న వెటకారంగా అత్తయ్యా మా కావ్య నీకు మంచి ఆఫర్ ఇచ్చింది అంటుంది. దీంతో రుద్రాణి, స్వప్న మధ్య గొడవ జరుగుతుంది.
మరోవైపు కావ్యను గుర్తు చేసుకున్న రాజ్ నేరుగా కావ్య ఆఫీసుకే వెళ్లాలని డిసైడ్ అవుతాడు. యామని రాజ్‌ను చూసి వచ్చేశావా బావ నేను నీకోసమే చూస్తున్నాను అంటుంది. ఇంతలో యామిని వాళ్ల డాడీ యామిని నీతో కలిసి టిఫిన్ చేయాలని నీకోసమే వెయిట్ చేస్తుంది. వచ్చేయండి టిఫిన్ చేద్దాం అంటాడు. దీంతో రాజ్ నాకు ఇప్పుడు ఆకలిగా లేదండి.. నువ్వు టిఫిన్ చేయ్ యామిని అంటాడు. ఇంతసేపు నీ కోసమే వెయిట్ చేశాను కదా బావ. నాకోసం కాఫీ తాగుతూ కంపెనీ అయినా ఇవ్వు బావ అని అడుగుతుంది. దీంతో రాజ్ లేదు యామని నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్లాలి అంటాడు. దీంతో వైదేమి అయితే యామిని కూడా తీసుకెళ్లండి బాబు అంటుంది. ఇంతలో యామిని మమ్మీ ఎందుకు బావను ఇబ్బంది పెడతావు. బావ ఏ పని మీద వెళ్తున్నాడో ఏంటో..? ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయి కదా..? అలాంటి పనుల మీద వెళ్తున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు మమ్మీ. బావ నువ్వు మమ్మీ మాటలేం పట్టించుకోకు నువ్వు ఎక్కడికైనా వెళ్లు.. కానీ నువ్వు వెళ్లిన చోట నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇక్కడ ఈ చిన్ని గుండె తట్టుకోలేదు అంటుంది.
రాజ్ ఓకే యామిని అంటూ వెళ్లిపోతాడు. ఇంతసేపు రాజ్‌తో మాట్లాడింది మన యామియేనా..? అంటుంది వైదేహి. దీంతో యామిని ఏం డౌటా ఎందుకు..? అంటుంది. దీంతో వైదేహి ఆశ్చర్యంగా ఉంది యామని మీ నాన్న కూడా నువ్వు ఇచ్చిన షాక్‌తో అలా చూస్తుండిపోయాడు అంటుంది. మగాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే మనమే వాళ్ల దారిలోకి వెళ్లి ప్రేమగా లాలించాలి, బుజ్జగించాలి అని నువ్వే చెప్పావు కదా మామ్ అంటుంది యామిని. నువ్వు అలా చెప్పిన తర్వాత నేను తన దగ్గరకు వెళ్లి ప్రేమగా కారు కీస్ కూడా ఇచ్చాను అనగానే.. నువ్వు నా మాట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ రాజ్ ఒంటరిగా బయటకు వెళితే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే.. అంటూ డౌట్ క్రియేట్ చేస్తుంది. యామిని మాత్రం మమ్మీ నాకు రాజ్ అంటే పిచ్చి ఉంది.
కానీ బై బర్త్ నేను పిచ్చిదాన్ని కాదు. రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలంటే.. తనతో ఉండాల్సిన అవసరం లేదు అంటుంది. అంటే తన గురించి తెలుసుకోవడానికి తనకు తెలియకుండా ఫాలో అవుతావా అని వాళ్ల డాడీ అడుగుతాడు. లేదు డాడీ కారులో జీపీఎస్ పెట్టాను. నా ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నాను. సో తను ఎక్కడికి వెళ్తున్నాడు. ఎంత సేపు స్పెండ్ చేస్తున్నాడు. మొత్తం నాకు తెలిసిపోతుంది. కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదు. నాకు నష్టం జరగనంత వరకు రాజ్ కు నా వల్ల ఏ కష్టం రాదు అని చెప్తుంది. వైదేహి వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుంటారు.
కావ్య ఆఫీసుకు వెళ్తుంది. ఉద్యోగులందరూ కావ్యను జాలిగా చూస్తుంటారు. శ్రుతి ఎమోషనల్ డైలాగ్స్ చెప్తుంది. తర్వాత కావ్య వెళ్లి తన పని తాను చేసుకుంటుంది. మరోవైపు కావ్యను కలవడానికి వెళ్తున్న రాజ్ కారును జీపీఎస్‌లో అబ్జర్వ్ చేస్తుంది యామిని. రాజ్ కారు నేరుగా కావ్య వాళ్ల ఆఫీసుకు వెళ్తుంది. అది చూసిన యామిని టెన్షన్ పడుతుంది. ఇదేంటి కారు స్వరాజ్ కంపెనీ వైపు వెళ్తుంది. అనుకోకుండా వెళ్తున్నాడా..? తెలిసే వెళ్తున్నాడా..? అనుకుంటూ కంగారు పడుతుంది. రాజ్ కారు ఆఫీసు ముందు ఆపేసి స్వరాజ్ గ్రూఫాప్ కంపెనీ కళావతి చెప్పింది ఇదే అడ్రస్ అనుకుంటాడు. మరోవైపు యామని కంగారుగా రాజ్ ఆఫీసులోకి వెళితే గతం గుర్తుకు రావొచ్చు ఎలాగైనా ఆపాలి అనుకుంటుంది. మరోవైపు కావ్యకు రాజ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. దీంతో రాజ్ బొకే పట్టుకుని లోపలికి వెళ్తుంటాడు.
గేటు దగ్గరకు వచ్చిన రాజ్‌ను కావ్య సీసీటీవీలో చూస్తుంది. వెంటనే కంగారు పడుతుంది. ఇక్కడ స్టాప్ అందరూ షాక్ అవుతారు. అందరికీ నిజం చెప్పాల్సి వస్తుంది. నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేరు అని కంగారుగా బయటకు వస్తుంది. రాజ్‌ను పక్కకు లాక్కుని వెళ్లిపోతుంది. ఏంటండి ఇది మీరు చెప్పకుండా ఇలా వస్తే ఎలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి అని కావ్య అడగ్గానే.. అనుకోకుండా వచ్చేశాను అంటాడు రాజ్. సరే అయితే అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం రండి అని పక్కకు తీసుకెళ్తుంది కావ్య. మరోవైపు స్వరాజ్ ఆఫీసు దగ్గరకు యామిని కారుల వస్తుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?