OTT Movie : ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ నటించిన ఒక వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఈ రోజునుంచి వచ్చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ తో తెరకెఎక్కిన ఈ సిరీస్ లో ఆర్నాల్డ్ CIA ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఇదివరకే వచ్చిన సీజన్ 1 ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సీజన్ 2 మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సిరీస్ వివరాలను తెలుసుకుందాం పదండి.
సీజన్ 1
ఈ స్టోరీ లూక్ బ్రన్నర్ (ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్) ఒక CIA ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు అతను రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉంటాడు. అయితే ఒక చివరి మిషన్ కోసం గయానాలో ఒక ఏజెంట్‌ను రక్షించమని అతన్ని పిలుస్తారు. ఆక్కడికి వెళ్ళాక ఆ ఏజెంట్ అతని కుమార్తె ఎమ్మా (మోనికా బార్బరో) అని తెలుస్తుంది. ఆమె కూడా CIAలో రహస్యంగా పనిచేస్తోందని లూక్ తెలుసుకుంటాడు. ఇక వీళ్ళు ఒక ప్రమాదకరమైన క్రిమినల్, బోరో (గాబ్రియెల్ లూనా), ను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. బోరో ఒక అణు ఆయుధాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. లూక్‌తో గతంలో బోరో తండ్రి ఒమర్‌ను చంపి ఉంటాడు. ఈ మిషన్‌లో లూక్, ఎమ్మా కలసి పోరాడాల్సి వస్తుంది. మరో వైపు లూక్ తన మాజీ భార్య టాలీని తిరిగి పొందాలని కోరుకుంటాడు. ఇక్కడ బ్రన్నర్స్ ఎవరో క్రిమినల్స్ కి తెలిసిపోతుంది.
సీజన్ 2
ఒక రహస్య CIA ఆపరేషన్ మధ్యలో, లూక్ బ్రన్నర్ (ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్) అతని కుమార్తె ఎమ్మా (మోనికా బార్బరో)ల గుర్తింపు బయట పడటంతో , ప్రమాదకరమైన శత్రువుల నుండి తప్పించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు తమ కుటుంబాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికి ప్రమాదకరమైన మిషన్‌లోకి దిగుతారు. ఈసారి గ్రెటా అనే ఒక సీక్రెట్ మహిళ (క్యారీ-ఆన్ మాస్) లూక్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అతని గతం నుండి ఒక రహస్యాన్ని తీసుకొస్తూ, లూక్ తో బంధాన్ని టాలీ (అతని మాజీ భార్య) పెంచుకుంటుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారుతుంది. చివరికి లూక్ ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేస్తాడా ? తన కూతుర్ని కాపాడతాడా ? ఇతని లవ్ స్టోరీ ఏమౌతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : జర్నలిస్ట్ ని టార్గెట్ చేసే మాఫియా … ఓటీటీలో కేక పెట్టిస్తున్నక్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఫూబర్’ (FUBAR). నిక్ సాంటోరా దీనిని రూపొందించారు. 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1కి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది.ఇందులో ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ (లూక్ బ్రన్నర్), మోనికా బార్బరో (ఎమ్మా), క్యారీ-ఆన్ మాస్ (గ్రెటా), ఫార్చ్యూన్ ఫీమ్‌స్టర్ (రూ), జే బారుచెల్ (కార్టర్), ట్రావిస్ వాన్ వింకిల్ (ఆల్డన్), మిలన్ కార్టర్ (బారీ), బార్బరా ఈవ్ హారిస్ (డాట్), ఫాబియానా ఉడెనియో (టాలీ), గాబ్రియెల్ లూనా (బోరో) వంటి నటులు నటించారు.