OTT Movie : ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమాలను చాలామంది ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ సజెషన్ ను తీసుకొచ్చాము. ఓ అబ్బాయి లైఫ్ ను జెట్ స్పీడ్ తో ఎగిరే తాబేలు ఎలా మార్చింది అనే స్టోరీ లైన్ తో ఈ మూవీ నడుస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
స్టోరీలోకి వెళ్తే…
షోవా ఎరా (1965–1980)లో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ Gamera : the Giant Monster. 1965లో గమెరా అనే సూపర్ పవర్స్ ఉన్న ఒక తాబేలు మాన్స్టర్ గా మారి విధ్వంసం సృష్టిస్తుంది. కానీ తర్వాత మాత్రం మానవాళి రక్షకుడిగా మారుతుంది. ఈ ఎరాలో గమెరా గైరోస్, విరాస్, జిగ్రా లాంటి గ్రహాంతర రాక్షస జీవులతో పోరాడుతుంది. ఈ సినిమాలు పిల్లలకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే గమెరా ఇందులో పిల్లలతో స్నేహం చేస్తూ వారిని కాపాడుతుంది.
హీసీ ఎరా (1995–1999)లో Gamera: Guardian of the Universe, Gamera 2: Attack of Legion, Gamera 3: Revenge of Iris అనే సీక్వెల్స్ వచ్చాయి. ఇందులో గమెరాను మరింత గంభీరమైన, పౌరాణిక రక్షకుడిగా చూపించారు. ఈ సీక్వెల్స్ లో గమెరా గాయస్, లెజియన్, ఐరిస్ లాంటి శక్తివంతమైన శత్రువులతో పోరాడుతుంది. ఈ సినిమాలలో కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మాత్రం లేటెస్ట్ మూవీ గురించి. రీబూట్ (2006) : Gamera the Braveలో గమెరా ఒక చిన్న తాబేలుగా పుట్టి, ఒక అబ్బాయి సహాయంతో హీరోగా ఎదుగుతుంది. కానీ మొదట్లో దానికి సూపర్ పవర్స్ ఉన్నాయన్న విషయం ఈ అబ్బాయికి తెలియదు. అసలు విషయం తెలిశాక దాన్ని ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ పక్కింటి పిల్ల మాత్రం కనిపెడుతుంది. మరి చివరికి ఈ జెయింట్ మాన్స్టర్ వాల్ల ఆ పిల్లాడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? మూవీ క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
అసలు ఈ గమెరా అంటే ఏంటి?
గమెరా (Gamera) ఒక జపనీస్ కైజు (రాక్షస) సిరీస్‌లోని ప్రధాన పాత్ర. ఇది ఒక భారీ, ఎగిరే తాబేలు మాన్స్టర్. గమెరా స్టోరీ డైసీ స్టూడియోస్ బ్యానర్ ద్వారా 1965లో ప్రారంభమైంది. గాడ్జిల్లాతో పోటీగా దీన్ని క్రియేట్ చేశారు. గమెరా సినిమాలు సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్ జానర్‌లో ఉంటాయి. ఇది సాధారణంగా ఆర్కిటిక్ మంచు కింద లేదా భూమి లోతుల్లో నిద్రాణస్థితిలో ఉంటుంది. ఆధునిక కాలంలో అణు పరీక్షలు లేదా మానవ జోక్యం వల్ల గమెరా మేల్కొంటుంది. కొన్ని సినిమాల్లో గమెరా అట్లాంటిస్ లాంటి పురాతన నాగరికతలో సృష్టించిన రక్షకుడిగా కన్పిస్తుంది.
Read Also : ఏప్రిల్ లో ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళ సినిమాలు ఇవే… ఇందులో మీరెన్ని చూశారు?
ఏ ఓటీటీలో ఉందంటే?
గమెరా తన కాళ్లను లోపలికి లాగి, జెట్ ఇంజన్‌లా శరీరం నుండి జ్వాలలు విడుదల చేస్తూ గాలిలో ఎగురుతుంది. అలాగే నోటి నుండి అగ్నిని విసరగలదు. అపారమైన శక్తి, రక్షణ కవచంతో ఇది శత్రువులతో పోరాడుతుంది. జపనీస్ సినిమాల్లో ప్రత్యేకమైన కైజు, దాని సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. కొన్ని గమెరా సినిమాలు ఉచితంగా లేదా రెంట్ ఆప్షన్‌తో యూట్యూబ్ (YouTube)లో అందుబాటులో ఉన్నాయి.