OTT Movies : ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో మలయాళ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇక ప్రతి నెల పదుల సంఖ్యలో ఈ మలయాళ సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సోనీ లివ్ (SonyLIV), మనోరమా మ్యాక్స్ (Manorama Max), జియో హాట్ స్టార్ (JioHotstar) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన మస్ట్ వాచ్ మలయాళ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
1. Pravinkoodu Shappu
బ్లాక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన మలయాళ మూవీ ‘ప్రవీణ్కూడు షప్పు’. సోనీ లివ్ ఓటీటీలో (SonyLIV) ఓటీటీలో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్, చందిని శ్రీధరన్, శివజిత్
తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఒక గ్రామంలోని కల్లు షాపు దగ్గర జరిగిన మర్డర్ చుట్టూ కథ తిరుగుతుంది. సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ (బాసిల్ జోసెఫ్) ఈ కేసును విచారిస్తాడు. 11 మంది నిందితులను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక్కో సీక్రెట్ ను రివీల్ చేస్తాడు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో IMDbలో 7.0 రేటింగ్ ఉంది.
2. Painkili
‘పైన్కిలి’ మూవీ ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా. శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సజిన్ గోపు, అనస్వర రాజన్, రోషన్ షనవాస్ తదితరులు లీడ్ రోల్స్ పోషించారు. ఫహద్ ఫాసిల్, జితు మాధవన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మనోరమా మ్యాక్స్ (Manorama Max)లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
సుకు అనే యువకుడు పిచ్చివాడిలా నటిస్తూ ప్రేమలో పడతాడు. ఈ రొమాంటిక్ డ్రామాలో ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా మెండుగా ఉంటుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.
3. Dasettante Cycle
కామెడీ డ్రామా ‘దసెట్టంటే సైకిల్’ ఏప్రిల్ 13 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం మనోరమా మ్యాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ అవుతోంది. అఖిల్ కావుంగల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఒక సైకిల్ చుట్టూ తిరుగుతుంది. మార్చి 14 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.
4. Bad Boyz
మలయాళ యాక్షన్ కామెడీ మూవీ ‘బ్యాడ్ బాయ్స్’. ఏప్రిల్ 13 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), మనోరమా మ్యాక్స్ (Manorama Max) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. రహ్మాన్, బాబు ఆంటోనీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి దర్శకుడు ఒమర్ లులు. హై-ఎనర్జీ యాక్షన్, కామెడీ సన్నివేశాలతో నిండిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైంది.
5. Gentlewoman
క్రైమ్ థ్రిల్లర్ ‘జెంటిల్ ఉమెన్’ టెంటకొట్ట (Tentkotta) ఓటీటీలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి వచ్చింది. లిజోమోల్ జోస్, హరి కృష్ణన్, లోస్లియా మరియనేసన్ నటించిన ఈ సినిమాకు జోషువా సేతురామన్ దర్శకుడు. పూర్ణి అనే కొత్త పెళ్లి కూతురుకు తన భర్త అరవింద్ కు ఎఫైర్ ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి? అనేది స్టోరీ. ఈ మూవీ మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది.
6. Am Ah
ఏప్రిల్ 18న సన్ ఎన్ఎక్స్టీ (SunNXT)లోకి వచ్చిన రొమాంటిక్ డ్రామా Am Ah.
7. L2: Empuraan
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘ఎల్ 2 : ఎంపురాన్). ఏప్రిల్ 24 నుంచి ఈ మూవీ జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమ్ అవుతోంది.