OTT Movie : సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఈ సినిమాలలో ఎక్కువ ట్విస్టులు ఉండటంతో, మూవీ లవర్స్ బాగా థ్రిల్ అవుతూ ఉంటారు. మూవీ లవర్స్ ని బాగా థ్రిల్ చేసే ఒక మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘గెరాల్డ్స్ గేమ్‘ (Gerald’s game). 2017 లో వచ్చిన ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీకి మైక్ ఫ్లానాగన్ దర్శకత్వం వహించగా, జెఫ్ హోవార్డ్, ఫ్లానాగన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఏకాంతంగా గడపాలనుకునే జంటకి ఆ ప్రాంతంలో అనుకోని సంఘటనలు ఎదురు పడతాయి. ఈ హాలీవుడ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్, తన భర్తతో కలిసి ఒక వెకేషన్ కి ప్లాన్ చేస్తుంది. అది ఒక మారుమూల ప్రాంతం కావడంతో, చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండరు. అక్కడికి వచ్చిన ఈ జంట ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తారు. అయితే రోజులా కాకుండా కొత్త తరహాలో చేయాలనుకుంటారు. భర్త ఆ పని కోసం కొన్ని మాత్రలు కూడా మింగుతాడు. భార్యని మంచం మీద చేతులను లాక్ చేసి ఉంచుతాడు. కొత్త తరహాలో ట్రై చేయాలనుకున్న భర్త, టాబ్లెట్స్ ప్రభావంతో గుండె ఆగి చనిపోతాడు. ఈ హఠాత్ పరిణామంతో హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే అక్కడ నుంచి తప్పించుకోడానికి ఎంత ప్రయత్నించినా, చేతులని లాక్ చేయడంతో అది సాధ్యం కాకుండా పోతుంది. ఎంత అరిచినా ఎవరూ రాకపోవడంతో నిరాశపడుతుంది. ఈలోగా భర్త ఆత్మ బయటకి వచ్చి, రేపటిలోగా నువ్వు కూడా చనిపోతావు అంటూ భయపెడుతుంది. తప్పించుకునే ప్రయత్నం ఎంత చేసిన ఎవరూ రారని చెబుతుంది. వాటర్ తాగడానికి కూడా ఆమెకు చేతకాక పోవడంతో అలాగే ఉండిపోతుంది.
అప్పుడే తన గతం తలుచుకుని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు తండ్రి కూడా ఒక మంచి లొకేషన్ కి తీసుకువెళ్తాడు. అయితే అక్కడ హీరోయిన్ తో తప్పుగా నడుచుకుంటాడు. తండ్రితో ఆమె ఇక నువ్వెప్పుడూ నాకు కనపడవద్దు అంటూ చెబుతుంది. ఈ కలకంటూనే మళ్లీ మెలకువలోకి వస్తుంది. చివరికి హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకోగలుగుతుందా? హీరోయిన్ తో ఏకాంతంగా గడపడానికి వచ్చింది ఎవరు? ఆమె తండ్రి ఏమై ఉంటాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న, ‘గెరాల్డ్స్ గేమ్’ (Gerald’s game) అనే ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలతో అదరగొట్టే ఈ మూవీని, ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి.