India Pak War: భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ఎక్కడికి అక్కడా కూల్చివేసిన త్రివిధ దళాలు.. ఆపరేషన్ సిందూర్ ను కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్ ను భారత్ ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సిందూర్ ను ఆపేది లేదు దాడులకు ప్రతిదాడి బరాబర్ ఉంటుంది. దేశ భద్రతే మాకు ముఖ్యం. తప్పు చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టం. దొరకబట్టి కఠినంగా శిక్షంచే వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుంది. పీవోకేలోని ఒక్క ఉగ్రవాది ఉండకుండా చేయడమే తమ అంతిమ లక్ష్యం అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పాక్‌పై భారత్ డిజిటల్ వార్
అయితే మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌పై భారత్ డిజిటల్ యుద్ధం ప్రకటించింది. దాయాది దేశ వెబ్ కంటెంట్ పై, పాడ్ కాస్ట్‌లపై భారత్ నిషేధం విధించింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణం అమలులోకి రానున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ వెబ్ కంటెంట్‌పై కేంద్రం బ్యాన్ విధించింది. పాక్ ఓటీటీలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్‌లపై కేంద్రం నిషేదం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి రావాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: India Pak War: ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ.. పాక్‌కు భారత్ మరో స్ట్రాంగ్ వార్నింగ్