India Pak War: ఆపరేషన్ సింధూర్ ను చూసి పాక్ గజగజ వణుకుతోంది. ఇప్పటికే తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన భారత త్రివిధ దళాలు.. ఆపరేషన్ సిందూర్ ను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్ ను భారత్ ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సిందూర్ ను ఆపేది లేదు.. దాడులకు ప్రతిదాడి బరాబర్ ఉంటుంది. దేశ భద్రతే మాకు ముఖ్యం. తప్పు చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టం. దొరకబట్టి కఠినంగా శిక్షంచే వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుంది. పీవోకేలోని ఒక్క ఉగ్రవాది ఉండకుండా చేయడమే తమ అంతిమ లక్ష్యం అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్‌కు రూ.1600 కోట్ల నష్టం..
అయితే దాయాది దేశ పాకిస్థాన్ దాడులను భారత్ తిప్పికొడుతూ.. ఎదురుదాడులు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.1600 కోట్ల పాకిస్థాన్ ఆస్తులను భారత్ ధ్వంసం చేసింది. పాక్ లోని కీలక నగరాలపై భారత్ దాడులకు దిగుతోంది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ అటాక్ చేస్తోంది. S -400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో.. పాక్ మిస్సైల్స్ ను భారత్ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి తెచ్చుకున్న HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. అలాగే రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. రావల్పిండి, సియాల్ కోట్, కరాచీ, లాహోర్ లో డ్రోన్లతో భారత్ ఎదురుదాడులు చేస్తోంది.
అమాయకులకు నష్టం జరగకుండా చూశాం
అయితే, ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకేలోని ఉగ్రవాదులను వేటాడుతున్నామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న సైనికులకు అభినందనల తెలిపారు. దాడుల్లో అమాయకులకు నష్టం జరగకుండా చూశామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పేరిట హై- క్వాలిటీ పరికరాలతో భారత్ దాడి చేసిందని వివరించారు. పాక్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన తెలిపారు.
పాక్‌కు మరో స్ట్రాంగ్ వార్నింగ్
ఈ క్రమంలోనే దాయాది దేశం పాకిస్థాన్ కు రాజ్‌నాథ్ సింగ్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని చెప్పారు. మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. పీవోకేలోని ఉగ్రవాదులను వేటాడుతున్నాని… దాడులకు ప్రతిదాడులు తప్పవని దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: India Vs Pakistan : లాహోర్ ఖతం.. పాక్‌పై డ్రోన్లతో అటాక్.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం
అమెరికా పౌరులకు కీలక సూచన
ఇదే క్రమంలో పాక్ లో పర్యటిస్తున్న తమ పౌరులకు అమెరికా కీలక సూచనలు చేసింది. షెల్టర్టలోకి వెళ్లాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. లాహోర్ ఎయిర్‌పోర్ట్ పరిసరాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Amritsar Blast: పంజాబ్ అమృత్‌సర్‌లో అర్ధరాత్రి పేలుళ్లు.. 5 నిమిషాల్లో మూడు సార్లు బ్లాస్ట్..