AP Local Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ కానుంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుండగా.. కూటమి అగ్రనేతలు సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టారు. మంగళవారం సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ ప్రత్యేక సమావేశంలో లోకల్ ఎలక్షన్స్ పైనే చర్చ జరిగే అవకాశం ఉంది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య స్థానాల సర్దుబాటు ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు చేయనున్నారు. ముఖ్యంగా ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి? ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంది? స్థానికంగా ఏ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి? అనే అంశాలపై చర్చిస్తారు. ఇక కేవలం సీట్ల సర్దుబాటుతోనే ఈ సమావేశం పరిమితం కాదని తెలుస్తోంది. ఎన్నికల కార్యాచరణ, పార్టీల మధ్య సమన్వయం, స్థానిక స్థాయిలో నేతల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే గ్రామాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో సీట్ల పంపకంపై కూటమి నిర్ణయం కీలకంగా మారనుంది.
Also read: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!
మరోవైపు ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. డిసెంబర్ నాటికి మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత తీసుకురావాలని అగ్రనేతలు భావిస్తున్నారు. అంటే.. మంగళవారం భేటీ కేవలం నేతల సాధారణ సమావేశం కాదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి వ్యూహానికి ఇది కీలక అడుగుగా మారనుంది. మొత్తానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also read: విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!