Sci-Fi Thriller: ఓ శాస్త్రవేత్త తన ఫ్యామిలీతో లైఫ్ లో సంతోషంగా ఉంటాడు. భార్య, కొడుకు, కుటుంబం… అంతా బాగానే సాగుతుంది. కానీ ఓ రాత్రి అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత కళ్లు తెరిచేసరికి అతని ప్రపంచమే మారిపోయి ఉంటుంది. భార్య అదే భార్యే… కానీ ఆమె అతన్ని గుర్తించదు. అతని ఇంట్లో అతని స్థానంలో మరో వ్యక్తి ఉంటాడు. అసలు తన జీవితంలో ఏది నిజం, ఏది మరో ప్రపంచం అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయాణం మొదలవుతుంది. మల్టీవర్స్ ను ఓ సైన్స్ ప్రయోగంతో కలిపిన మైండ్ బెండింగ్ సై-ఫై థ్రిల్లర్ ‘డార్క్ మ్యాటర్’ (Dark Matter). మరి ఈ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జేసన్ డెస్సెన్ చికాగోలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తాడు. అతని భార్య డానియెలా, కొడుకు చార్లీతో సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతుంటాడు. ఒక రాత్రి ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి అతన్ని అపహరిస్తాడు. ఆ తర్వాత జేసన్ మేల్కొన్న ప్రపంచం అతనికి పూర్తిగా కొత్తగా ఉంటుంది. అతను తనకు తెలిసిన ఇంట్లోనే ఉంటాడు. కానీ అక్కడ అతని భార్య ఉండదు. బదులుగా డానియెలా మరో జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపిస్తుంది. జేసన్ కూడా ఆ ప్రపంచంలో ఓ ప్రముఖ శాస్త్రవేత్తగా మారిపోయి ఉంటాడు. తాను అసలు జీవితంలో సాధించని విజయాలు ఇక్కడ సాధించినట్లు తెలుస్తుంది.
మొదట ఏం జరిగిందో జేసన్ కు అర్థం కాదు. కానీ తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి, తన శాస్త్రీయ పరిశోధన, ఓ రహస్యమైన బాక్స్ మధ్య సంబంధం ఉందని తెలుసుకుంటాడు. ఈ బాక్స్ ద్వారా వేర్వేరు ప్రపంచాల మధ్య ప్రయాణించే అవకాశం ఉందని తెలుస్తుంది. తన అసలు కుటుంబం ఉన్న ప్రపంచానికి తిరిగి వెళ్లడానికి జేసన్ ఆ బాక్స్ లోకి అడుగు పెడతాడు. కానీ ప్రతి ప్రపంచంలో అతనికి మరో జేసన్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రపంచాల్లో అతని జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మరికొన్నింటిలో అతను పూర్తిగా వేరే వ్యక్తిగా ఉంటాడు. ప్రతి మార్గం అతనికి తన జీవితంలో తీసుకోని నిర్ణయాల ఫలితాలను చూపిస్తుంది.
జేసన్ కు అతిపెద్ద సమస్య మరో జేసన్. తన అసలు జీవితాన్ని తిరిగి పొందాలని ప్రయత్నిస్తున్న అతనికి, మరో ప్రపంచంలో ఉన్న జేసన్ కూడా తనకు కావాల్సినదే కోరుకుంటాడు. డానియెలా, చార్లీని తిరిగి పొందేందుకు జరిగే ఈ పోరాటం క్రమంగా మల్టీవర్స్ ల మధ్య యుద్ధంగా మారుతుంది. ఎన్ని ప్రపంచాలు ఉన్నా తనకు కావాల్సింది ఒక్కటేనని జేసన్ నిర్ణయించుకుంటాడు. తన కుటుంబం. కానీ ఆ కుటుంబాన్ని చేరుకునే ప్రతి అడుగు అతన్ని మరో ప్రమాదంలోకి నెడుతుంది. మరి ఆ ప్రమాదం ఏంటి ? చివరికి అతను తన ఫ్యామిలీని ఎలా చేరుకున్నాడు ? అన్నది తెలియాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.
జోయెల్ ఎడ్జర్టన్ (Joel Edgerton), జెన్నిఫర్ కానెల్లీ (Jennifer Connelly), ఆలిస్ బ్రాగా (Alice Braga) నటించిన ఈ సిరీస్ ను బ్లేక్ క్రౌచ్ (Blake Crouch) రూపొందించారు. Apple TVలో అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్ లేదు, అయితే తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్