BigTV English

OTT Movie : అమ్మాయితో అర్ధరాత్రి ఆ పాడు పని… సూపర్ స్టార్ పై మీటూ ఆరోపణలు… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయితో అర్ధరాత్రి ఆ పాడు పని… సూపర్ స్టార్ పై మీటూ ఆరోపణలు… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ‘MeToo’ ఉద్యమం భారత దేశంలో సృష్టించిన అలజడి ఇంతా అంతా కాదు. మహిళలపై జరుగుతున్న వేధింపులపై బహిరంగంగానే చర్చలు జరిగాయి. ఎంతోమంది ధైర్యంగా తమకు జరిగిన వేధింపుల గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒక అమ్మాయి తనపై జరిగిన వేధింపులను బహిరంగంగా వెల్లడిస్తుంది. నిజంగానే తప్పు జరిగిందా ? లేకపోతే ఆరోపణలా ?అనే విషయం మీదా స్టోరీ ఆసక్తికరంగా తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘గిల్టీ’ (Guilty) అనేది 2020లో విడుదలైన హిందీ థ్రిల్లర్ డ్రామా సినిమా. దీనికి రుచి నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అకాంక్ష రంజన్ కపూర్, గుర్ఫతేహ్ సింగ్ పిర్జాదా, తాహెర్ షబ్బీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా నిర్మించబడిన మొదటి చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో 2020 మార్చి 6న విడుదలైంది. ఈ సినిమా ‘MeToo’ ఉద్యమం నేపథ్యంలో తిరిగే కథను చూపిస్తుంది. 1 గంట 59 నిమిషాల నిడివి ఉన్న ఈసినిమా, IMDbలో 5.4/10 రేటింగ్ ను పొందింది.


స్టోరీలోకి వెళ్తే

ఈ స్టోరీ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ మార్టిన్స్ కాలేజీలో జరుగుతుంది. ఇక్కడ నంకి దత్తా (కియారా అద్వానీ) అనే యువతి, తన ప్రియుడు విజయ్ “వీజే” (గుర్ఫతేహ్ సింగ్ పిర్జాదా) బ్యాండ్ “డూబీడూ” పాటకి రచయితగా పనిచేస్తుంది. వీజేకి కాలేజీలో చాలా క్రేజ్ ఉంటుంది. అతని బ్యాండ్‌లో తాషీ, కేపీ, హార్డీ ఉంటారు. ఇక మరొక పాత్రలో నంకి అనే ఒక తెలివైన, తిరుగుబాటు స్వభావం కలిగిన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకు గతంలోని ఒక ఇన్సిడెంట్ కారణంగా అప్పుడప్పుడు పానిక్ అవుతుంటుంది. ఇక ఈ స్టోరీ 2017 వాలెంటైన్స్ డే రాత్రి నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ కాలేజీలో ఒక సంగీత కచేరీ జరుగుతుంది. ఈ సమయంలో, ధన్‌బాద్ నుండి వచ్చిన కొత్త విద్యార్థిని తను కుమార్ వీజేపై క్రష్‌తో ఉంటుంది. తను ఒక “స్కాలర్‌షిప్ కిడ్”. కాలేజీ హైక్లాస్ స్టూడెంట్స్ తో అసౌకర్యంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి, తను మద్యం, డ్రగ్స్ ప్రభావంలో వీజేను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నంకి దీనిని గమనించి ఆమెపై అసహ్యం చూపిస్తుంది. కచేరీ తర్వాత, తను, వీజే, ఇద్దరు స్నేహితులు హాస్టల్‌కు వెళతారు. ఆ రాత్రి తర్వాత తను అదృశ్యమవుతుంది.

ఒక సంవత్సరం తర్వాత, #MeToo ఉద్యమం జోరందుకున్న సమయంలో, తను ట్విట్టర్ ద్వారా వీజేను 2018 వాలెంటైన్స్ డే రాత్రి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ కాలేజీలో గందరగోళం సృష్టిస్తుంది. నంకి తన ప్రియుడు నిర్దోషి అని నమ్ముతూ, అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె వీజే డిఫెన్స్ లాయర్ డానిష్ అలీ బైగ్ సహాయం తీసుకుంటుంది. అతను వీజే కుటుంబ స్నేహితుడైన లాయర్ మిర్చందానీ కింద పనిచేస్తాడు. వీజే తల్లిదండ్రులు, తను డబ్బు కోసం ఈ ఆరోపణలు చేస్తోందని వాదిస్తారు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ రాత్రి ఎం జరిగింది ? నిజంగానే తనుపై వీజే అఘాయిత్యం చేశాడా ? వీజేను నంకి ప్రేమిస్తుందా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఆంటీతో అరాచకం… చిన్న పిల్లాడితో ఇవేం పనులురా అయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

Related News

Superman OTT: సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ మ్యాన్..ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie: ఆ పనికి అడిక్ట్ అయిన అమ్మాయి కథ, ఒక్కడితో ఆపలేదు, నువ్వు ఒక్కడివే చూడు మామ

OTT Movie : కొత్త జాతి మనుషులు… 8 మంది చేసే నెవర్ బిఫోర్ పనులు… ఈ క్రేజీయెస్ట్ సిరీస్ వర్త్ వర్మా వర్త్

OTT Movie : IMDbలో 8.6 రేటింగ్… ‘సేక్రెడ్ గేమ్స్’ను మించిన ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : భర్త ఇంట్లో ఉండగానే భార్య మాజీ లవర్ ఎంట్రీ… నెక్స్ట్ ట్విస్టుకు బుర్రపాడు… కడక్ డార్క్ కథ మావా

Big Stories

×