OTT Movie : సెల్ ఫోన్ మనిషి జీవితంలో నిత్యవసరంగా మారిపోయింది. ఎవరు ఉన్నా లేకపోయినా ఉంటారేమో గానీ, సెల్ఫోన్ ఒక్క నిమిషం లేకపోయినా మనిషి పిచ్చెక్కిపోతాడు. ఈ సెల్ ఫోన్ ప్రభావం మితిమీరితే ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో చూపించారు. పబ్జి గేమ్ ప్రభావం వల్ల చాలామంది పిల్లలు సమస్యలు కొని తెచ్చుకున్నారు. పబ్జి గేమ్ వల్ల ఒక కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులతో ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ థ్రిల్లర్ మూవీ పేరు ‘హబ్జీ గబ్జీ’ (Habji Gabji). 2022 లో వచ్చిన ఈ బెంగాలీ థ్రిల్లర్ మూవీకి రాజ్ చక్రవర్తి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాజ్ చక్రవర్తి ఎంటర్‌టైన్‌మెంట్, సృజన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్యామ్ అగర్వాల్ నిర్మించారు. ఈ బెంగాలీ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
టిప్పు తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. అయితే తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో ఒక పని మనిషిని కూడా పెడతారు. ఆ పనిమనిషి మాత్రం ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చిన తండ్రితో క్రికెట్ ఆడాలనుకుంటాడు టిప్పు. తండ్రి బాగా అలసిపోయి వస్తూ ఉండటంతో, ఆడలేనని నీరసంగా చెప్తాడు. అలా టిప్పు ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. వాడి బాధను చూడలేక తండ్రి సెల్ఫోన్ అలవాటు చేపిస్తాడు. అందులో గేమ్స్ ఎలా ఆడాలి, ఎలా వాడాలో టిప్పు నేర్చుకుంటాడు. ఇంతలో స్కూల్ పిల్లలు ఇతనికి పబ్జి గేమ్ నేర్పిస్తారు. అప్పటినుంచి పబ్జి గేమ్ కి అలవాటు పడిపోతాడు టిప్పు. ఎప్పుడూ సెల్ ఫోన్ లోనే ఆడుకుంటూ ఉండటంతో, తల్లి టిప్పు పై కోప్పడుతుంది. అందుకు టిప్పు తల్లిపై సీరియస్ గా రియాక్షన్ ఇస్తాడు. ఈ విషయం భర్తకు చెప్పడంతో, టిప్పు దగ్గర సెల్ ఫోన్ లాక్కుంటాడు తండ్రి. సెల్ ఫోన్ చేతిలో లేకపోవడంతో, క్రికెట్ బ్యాట్ తీసుకుని తనకు తానే తల మీద కొట్టుకుంటాడు.
ఆ తర్వాత అతనిలో మార్పు తేవడానికి ఒక వెకేషన్ కి తీసుకువెళ్తారు పేరెంట్స్. అక్కడ తనకు తానే సెల్ఫోన్ లేకుండా పబ్జి గేమ్ ఆడుతుంటాడు. హిల్ స్టేషన్ లో ఒక హోటల్లో గన్ తీసుకొని, ఎదురుగా వస్తున్న మనుషులను కాలుస్తాడు. అయితే ఇది పబ్జి గేమ్ ఆటలో భాగంగా అనుకుంటాడు టిప్పు. ఆ హోటల్ యజమాని, అతని భార్యతో సహా ఇద్దరూ తుపాకీ కి బలవుతారు. ఆ తర్వాత టిప్పు సృహ తప్పి పడిపోతాడు. హాస్పిటల్ కి టిప్పును తీసుకొస్తారు పేరెంట్స్. అక్కడికి పోలీసులు కూడా హంతకుల కోసం వస్తారు. చివరికి ఈ కేసు ఏమవుతుందనేది ‘హబ్జీ గబ్జీ’ (Habji Gabji) అనే ఈ మూవీ స్టోరీ చూసి తెలుసుకోవాల్సిందే…