E-Paper
Advertisement

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!
Advertisement

2027 Kawasaki Versys 650 Launched: కవాసకి తన అడ్వెంచర్ టూరర్ బైక్ వెర్సిస్ 650కి 2027 మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్ ధర రూ.8.63 లక్షలు (ఎక్స్‌-షోరూమ్)గా నిర్ణయించింది. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, కొత్త కలర్ ఆప్షన్‌ను మాత్రం యాడ్ చేసింది. ఆగస్టు చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

కొత్తగా వచ్చిన కలర్ ఇదే!

MY27 కవాసకి వెర్సిస్ 650లో కీలక మార్పు దాని రంగులోనే కనిపిస్తుంది. ఈసారి క్యాండీ లైమ్ గ్రీన్ కలర్‌లో బైక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఏకైక కలర్ ఆప్షన్‌గా ఉంది. డిజైన్‌లో లేదా బైక్ రూపంలో పెద్ద మార్పులు చేయలేదు. అలాగే ఇంజిన్, ఫీచర్లు, ఛాసిస్ వంటి అంశాలను కూడా గత మోడల్‌ నుంచే కొనసాగించారు. అంటే కొత్త వెర్సిస్ 650ను పూర్తిగా కొత్త మోడల్‌గా కాకుండా.. కొత్త మోడల్ ఇయర్ అప్‌ డేట్‌ గా చెప్పుకోవచ్చు.

అదే 649cc ఇంజిన్

Advertisement

కవాసకి వెర్సిస్ 650లో 649cc, లిక్విడ్‌-కూల్డ్, ప్యారలల్‌-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500rpm వద్ద గరిష్టంగా 67hp పవర్‌ను, 7,000rpm వద్ద 61Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అంతేకాదు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా అందుబాటులో ఉంది. రోజువారీ ప్రయాణంతో పాటు లాంగ్ రైడ్లకు కూడా ఈ ఇంజిన్ అనుకూలంగా ఉండేలా రూపొందించారు.

అదిరిపోయే ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే వెర్సిస్ 650లో అడ్జెస్ట్ చేసుకునే విండ్‌స్క్రీన్ ఉంది. దీంతో హైవేపై ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో గాలి ప్రభావాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఇందులో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, పూర్తి LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

21 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్

Advertisement

టూరింగ్ బైక్‌గా వెర్సిస్ 650లో పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు. దీని సామర్థ్యం 21 లీటర్లు. పూర్తి ట్యాంక్‌తో బైక్ బరువు 220 కిలోలుగా ఉంటుంది. సీటు ఎత్తు 845mm కావడంతో పొడవైన రైడర్లకు ఇది సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.

హోండా NX500తో పోటీ

భారత మార్కెట్లో కవాసకి వెర్సిస్ 650 ధర రూ.8.63 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). ఈ బైక్‌కు సమీప ప్రత్యర్థిగా హోండా NX500 ఉంది. దీని ధర రూ.7.44 లక్షలు. ధర విషయంలో వెర్సిస్ 650 కొంత ఖరీదైనప్పటికీ, 649cc ట్విన్-సిలిండర్ ఇంజిన్, టూరింగ్ ఫోకస్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ లాంటి అంశాలు దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. కొత్త కలర్‌తో వచ్చిన 2027 మోడల్ ద్వారా కవాసకి ఈ బైక్‌కు మరింత గుర్తింపు తీసుకురావాలని చూస్తోంది.

Read Also: టీవీఎస్ జూపిటర్ కు కొత్త లుక్.. సీక్వెన్షియల్ ఇండికేటర్లతో కొత్త స్కూటర్!

Tags

Related News

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

టీవీఎస్ జూపిటర్ కు కొత్త లుక్.. సీక్వెన్షియల్ ఇండికేటర్లతో కొత్త స్కూటర్!

యమహా కొత్త బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఓలాకు బిగ్ షాక్.. ఈ-స్కూటర్ మార్కెట్‌ లో నంబర్‌ వన్‌ గా టీవీఎస్!

పండుగ సీజన్‌ కు ముందే బజాజ్ బిగ్ ప్లాన్.. ఏకంగా 6 కొత్త బైక్‌లు రెడీ!

MG డబుల్ ధమాకా.. EV, PHEVతో కొత్త టోమాహాక్ SUVలు లాంచ్!

కారు కొనడం నుంచి ఎక్స్చేంజ్ వరకు.. స్పిన్నీ ప్లాన్ అదిరింది గురూ!

Big Stories

Advertisement
×