Horror Comedy Series: హాలోవీన్ సీజన్ వచ్చేసిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా దెయ్యాల కథలు, హారర్ సినిమాల జోరు పెరుగుతుంది. సరిగ్గా ఈ పండగ మూడ్ కి తగ్గట్టుగానే మోస్ట్ పాపులర్ కామెడీ హారర్ సిరీస్ ‘ఘోస్ట్స్’ (Ghost Season 6) తన ఆరవ సీజన్‌తో ఓటీటీలో అడుగుపెట్టింది. అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ లేటెస్ట్ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే ఫ్యాన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తోంది. దెయ్యాలంటే భయపడటం కాదు, అసలు ఆ దెయ్యాలకే ఈ మనుషులంటే భయం పుట్టేలా ఈ సిరీస్ ను క్రియేట్ చేశారు మేకర్స్. ఒక పాత ఎస్టేట్ లోకి మారిన యంగ్ కపుల్ కు అక్కడ ఉండే రకరకాల కాలాల నాటి దెయ్యాలతో ఎదురయ్యే ఎక్స్పీరియన్స్ లే ఈ సిరీస్ కథాంశం. మరి మీరు ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
సమంత, జే అనే భార్యాభర్తలకు ఓ పాత ఎస్టేట్ వారసత్వంగా వస్తుంది. దాన్ని అందమైన బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ వసతిగా మార్చి వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టాకే అసలు విషయం తెలుస్తుంది. అక్కడ గతంలో నివసించి చనిపోయిన ఎంతోమంది ఆత్మలు ఇంకా అక్కడే ఉంటాయి. సమంతకు మాత్రమే ఆ దెయ్యాలను చూడటం, వాటితో మాట్లాడటం సాధ్యమవుతుంది. దీంతో జేకు కనిపించని దెయ్యాల ప్రపంచం, సమంతకు మాత్రం రొటీన్ జీవితంలో భాగమైపోతుంది.
ఆ ఇంట్లో ఒక్కో దెయ్యానిది ఒక్కో కాలం, ఒక్కో మనస్తత్వం. తమకు అలవాటైన పద్ధతుల్లోనే ఉండాలని చూసే ఆత్మలు, కొత్తగా వచ్చిన సమంత, జేలతో తరచూ గొడవపడుతుంటాయి. మనుషుల సమస్యలు ఒకవైపు, చనిపోయిన తర్వాత కూడా తమ పాత అలవాట్లను వదులుకోలేని దెయ్యాల సమస్యలు మరోవైపు… రెండింటి మధ్య సమంత, జే పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి.
ఈసారి హాలోవీన్ స్పెషల్ లో మాత్రం అద్దమే పెద్ద తలనొప్పిగా మారుతుంది. జే ఇంటికి తీసుకొచ్చిన పురాతన అద్దం చుట్టూ అనూహ్యమైన పరిణామాలు మొదలవుతాయి. సమంత ఆస్ట్రేలియాలో ఉండటంతో ఇంట్లోని దెయ్యాలను చూసుకునే బాధ్యత కైల్ మీద పడుతుంది. మరోవైపు హెట్టీ తనకు దూరమైన సోదరి మార్గరెట్ ను అనూహ్యమైన పరిస్థితుల్లో మళ్లీ కలుసుకుంటుంది. బెలా నిర్వహించే హాలోవీన్ పార్టీ కూడా ఇంట్లో కొత్త గందరగోళానికి దారి తీస్తుంది. అద్దం వెనుక ఉన్న మిస్టరీ, దెయ్యాల మధ్య పెరిగే టెన్షన్ ఈ స్పెషల్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
‘Ghosts’ అమెరికన్ కామెడీ సిరీస్. ఇందులో అక్టోబర్ 29న విడుదలైంది కంప్లీట్ ఆరవ సీజన్ కాదు. ‘Halloween 6: The Mirror’ పేరుతో రెండు భాగాల హాలోవీన్ స్పెషల్. అమెరికాలో ఈ ఎపిసోడ్లు CBSలో ప్రసారం అవుతున్నాయి. భారతదేశంలో జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే సీజన్ 6 స్పెషల్ తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. హాలోవీన్ మూడ్ లో కామెడీతో కూడిన దెయ్యాల హంగామా చూడాలనుకుంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్.
Read Also: చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్ సంప్రదాయాన్ని చూశారా ?