E-Paper
Advertisement

ప్రపంచాన్నే వణికించిన రియల్ డాన్‌… దశాబ్దాల పరార్‌కు తెరదించిన అరెస్ట్‌… ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

ప్రపంచాన్నే వణికించిన రియల్ డాన్‌… దశాబ్దాల పరార్‌కు తెరదించిన అరెస్ట్‌… ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్
Advertisement

True Crime Documentary Series: దశాబ్దాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఓ డ్రగ్ డాన్‌… చివరికి ఓ ప్రైవేట్ విమాన ప్రయాణంతో అమెరికా అధికారుల చేతికి చిక్కాడు. అతడిని పట్టించింది ఎవరు ? సొంతవాళ్లే వెన్నుపోటు పొడిచారా ? లేక దీని వెనుక ఏదైనా రహస్య ఆపరేషన్ ఉందా ? ఈ ప్రశ్నల చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్‌ ‘ది ఫాల్ ఆఫ్ ఎల్ మాయో’ (The Fall of El Mayo). నిజ జీవితంలో జరిగిన సంచలన ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్‌ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఓటీటీ మూవీ లవర్స్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే…

ఇస్మాయెల్ ‘ఎల్ మాయో’ జాంబాడా గార్సియా… మెక్సికోలోని సినాలోవా కార్టెల్ సహవ్యవస్థాపకుడు. డ్రగ్స్ అక్రమ రవాణా ప్రపంచంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన అతడు, ఎల్ చాపో గుజ్‌మాన్‌ తో కలిసి పని చేశాడు. ఎన్నో ఏళ్లుగా అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చిన ఎల్ మాయో జీవితం 2024 జూలై 25న అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ రోజు జోక్విన్ గుజ్‌మాన్ లోపెజ్‌తో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో న్యూ మెక్సికోలోని చిన్న విమానాశ్రయానికి చేరుకున్న ఎల్ మాయోను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ఇంతకాలం ఎవరికీ చిక్కని అతడు ఒక్కసారిగా ఎలా పట్టుబడ్డాడు ? ఆ విమాన ప్రయాణం వెనుక అసలు ఏం జరిగింది ? అతడిని అక్కడికి తీసుకెళ్లింది కిడ్నాప్‌ లో భాగంగానా, నమ్మకద్రోహం వల్లనా, లేక తెరవెనుక సాగిన రహస్య ఆపరేషన్‌ కారణంగానా ? ఈ అంశాలే డాక్యుమెంటరీలో ప్రధాన అంశాలు. మూడు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఇంతకుముందు బయటకు రాని ఆర్కైవ్ దృశ్యాలు, మెక్సికోతో పాటు అమెరికాకు చెందిన వందలాది కోర్టు రికార్డులను ఉపయోగించారు. భద్రతా విభాగాల వ్యక్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, కార్టెల్‌ కు దగ్గరగా ఉన్నవారి అభిప్రాయాల ద్వారా ఈ ఘటనలోని వివిధ కోణాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఎల్ మాయో అరెస్టు వెనుక ఉన్న అనుమానాలు, అధికార వ్యవస్థలతో అతడికి సంబంధించిన పరిణామాలు, అతడి పతనానికి దారి తీసిన పరిస్థితులు తెరపైకి వస్తాయి.

ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్

‘ది ఫాల్ ఆఫ్ ఎల్ మాయో’ మూడు ఎపిసోడ్‌ ల లిమిటెడ్ డాక్యుమెంటరీ సిరీస్‌. అక్టోబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. ఇంగ్లీష్, స్పానిష్ భాషలకు సంబంధించిన ఈ సిరీస్‌ లో డ్రగ్ మాఫియా ప్రపంచం, దర్యాప్తు, అధికార పోరాటాలు, నమ్మకద్రోహం వంటి అంశాలను నిజ జీవిత ఆధారాలతో చూపించారు. ఎల్ మాయో ఎలా పట్టుబడ్డాడు ? అతడి పతనం వెనుక ఉన్న అసలు కారణాలేంటి ? అనే విషయాలు తెలుసుకోవాలనుకునే ట్రూ క్రైమ్ అభిమానులకు ఇది ఆసక్తికరమైన ఆప్షన్. దర్శకులు డారెన్ ఫోస్టర్ (Darren Foster), మిగెల్ ఫెర్నాండెజ్ ఫ్లోరెస్ (Miguel Fernández Flores) ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇది కల్పిత కథ కాదు. నిజంగా జరిగిన ఘటనను పరిశోధనాత్మకంగా చూపించే క్రైమ్ డాక్యుమెంటరీ. అందుకే సాధారణ గ్యాంగ్‌స్టర్ కథల కంటే ఇందులోని నిజాలు, సాక్ష్యాలు, ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి.

Advertisement

Read Also: ది గ్రేట్ పంజాబ్ రాబరీ… సినిమాను తలపించే రియల్ హీస్ట్… గూస్‌బంప్స్ గ్యారెంటీ

Tags

Related News

స్కూల్‌ టాయిలెట్‌లో గ్యాంగ్‌స్టర్‌ను బంధించే బుడ్డోడు… విజయ్ సేతుపతి క్రేజీ కామెడీ తెలుగులోనూ స్ట్రీమింగ్

పిచ్చాసుపత్రి బేస్మెంట్లో సైకోపాత్… మిస్సైన అమ్మాయి కోసం వేట… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

కష్టాల మధ్య చిగురించిన ప్రేమ… టామ్ క్రూజ్‌, నికోల్ కిడ్‌మన్‌ల క్లాసిక్‌ రొమాంటిక్ డ్రామా

పిల్లలు పుట్టరని తెలిసి షాకింగ్ డెసిషన్… దత్తత తీసుకోవాలనుకుంటే ఇదెక్కడి దారుణం ?

ఫ్రైడే ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు… అన్నీ తెలుగులోనే… మిస్ అవ్వకూడని సినిమాలు ఇవే

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×