BigTV English

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక మూవీ..చూస్తే గజ గజ వణకాల్సిందే..!

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక మూవీ..చూస్తే గజ గజ వణకాల్సిందే..!

OTT Movies : ఈ మధ్య ఓటీటీలోకి వస్తున్నా సినిమాలు కొన్ని డేట్ ను ముందుగానే లాక్ చేసుకొని వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం సడెన్ గా ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా ఓ మూవీ ఇవాళ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పేరేంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ..

హీరోయిన్  హన్సిక ఒకప్పుడు తెలుగు సినిమాలతో బిజీగా ఉండేది. ఇక్కడ అవకాశాలు ఒక్కొక్కటిగా దూరం అవ్వడంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అటు తమిళ్ళో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. హారర్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది. తాజాగా హన్సిక నటించిన లేడి ఒరియేంటెడ్ మూవీ గార్డియన్.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ చందర్ నిర్మించారు. ఇందులో సురేష్ చంద్రమీనన్‌, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.. అయితే ఈ మూవీ తమిళంలో గత ఏడాది రిలీజ్ అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు మాత్రం తెలుగులోకి ఓటీటీలోకి వచ్చేసింది. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు..


Also Read : వామ్మో.. ఏంటా రొమాన్స్.. సీరియల్స్‌లో కూడా ఇంత బోల్డా?

స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీలో అపర్ణ అనే అమ్మాయి చిన్నతనం లోనే నుంచి దురదృష్టం వెంటాడుతుంటుంది. అందరూ ఆమెను అన్‌లక్కీ అపర్ణ అని పిలుస్తుంటారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కన్‌స్ట్రక్షన్‌ లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వస్తుంది. అక్కడ ఆమెకు మెరుస్తున్న ఒక రాయి లాంటిది దొరుకుతుంది. అదే ఆమె చేతికి వచ్చిన తర్వాత అపర్ణ జాతకం పూర్తిగా మారిపోతుంది. దురదృష్టం అన్నవన్నీ అదృష్టం లాగా మారిపోతాయి. ఆమె వదిలేసి వెళ్లిపోయిన తన బాయ్ ఫ్రెండ్ మళ్ళీ తన లైఫ్ లోకి వస్తాడు.ఆఫీస్‌లో తన కారణంగా అపర్ణ తో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతుంటారు. వారిద్దరు చనిపోతే బాగుండునని అపర్ణ కోరుకుంటుంది. ఆఫీస్‌ ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు కంపెనీ హెడ్ తమ్ముడు చనిపోవాలని అపర్ణ కోరుకుంటుంది. ఆమె కళ్ల ముందే ఇద్దరు చనిపోతారు. ఆపర్ణ మనసులోని కోరికలు ఎలా నెరవేరుతున్నాయి? ఆ మెరుపులాంటి క్రిస్టల్ లో ఉన్న ఆత్మ ఎవరు? అపర్ణకు ఆ ఆత్మకు గల సంబంధం ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ.. తమిళ్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి…

హీరోయిన్ హన్సిక ఈమధ్య రొమాంటిక్ సినిమాలో కన్నా హారర్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. ప్రస్తుతం తమిళ సినిమా చేస్తుంది..

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×