BigTV English
Advertisement

Safest Tourist Places: భయం వద్దు.. ఇండియాలో ఈ టూరిస్ట్ ప్లేస్‌లు చాలా సేఫ్, ధైర్యంగా వెళ్లి రండి!

Safest Tourist Places: భయం వద్దు.. ఇండియాలో ఈ టూరిస్ట్ ప్లేస్‌లు చాలా సేఫ్, ధైర్యంగా వెళ్లి రండి!

Safest Tourist Places: ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గమ్‌లో జరిగిన భయానక ఉగ్రవాద దాడి టూరిస్ట్‌లలో ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టించింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో టూరిస్ట్‌లు కూడా ఉండడం గమనార్హం. పర్యటక ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు జరుగుతుండడంతో ఎంతోమంది తమ టూర్‌లను కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు టూర్లకు వెళ్లిన వారు భయంతో వెనక్కి వెళ్లిపోతున్నారు.


ఓ వైపు వేసవి కాలం, మరో వైపు పెళ్లిల సీజన్ కావడంతో పర్యటనలకు వెళ్లేవారు ఎక్కువగానే ఉంటారు. అయితే ఈ సమయంలో, ఇండియాలో సురక్షితంగా పర్యటించేందుకు అనువైన ప్రదేశాలు ఏవి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడికైనా టూర్‌కి వెళ్లాలి అనుకునే వారు ముందు అది సేఫ్ ప్లేసేనా కాదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎలాంటి భయం లేకుండా సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ఇండియాలో ఏ ప్లేస్ మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఉదయపూర్, రాజస్థాన్
రాజస్థాన్‌లో ఉండే ఉదయపూర్‌ను ఈస్ట్ యొకండా అని కూడా పిలుస్తారు. ఈ సిటీ దాని అద్భుతమైన, ప్రశాంతమైన వాతావరణంతో బాగా ఫేమస్ అయింది. ఇక్కడ ఉండే పిచోలా సరస్సు, సిటీ ప్యాలెస్ వంటి ప్రదేశాలు భద్రతా ఏర్పాట్లతో కూడిన సుందరమైన పర్యటనా కేంద్రాలుగా పేరుగాంచాయి. ఇప్పటికే రాజస్థాన్ పోలీస్ శాఖ టూరిస్ట్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బార్డర్‌‌లోకి వెళ్తే దాడి జరుగుతుందని భయపడే వారు ఉదయపూర్‌కు వెళ్లి టూర్‌ను ఎంజాయ్ చేయడం మంచిది.


షిమ్లా, హిమాచల్ ప్రదేశ్
హిమాలయాల మధ్య ఉన్న ఈ హిల్ స్టేషన్ సహజ సౌందర్యంతో పాటు శాంతియుత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది. జక్కూ హిల్, మాల్ రోడ్ వంటి ప్రదేశాలలో భద్రతా బలగాలు కాపుకాస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం టూరిస్ట్ హెల్ప్‌లైన్‌లను కూడా అందిస్తోంది. సమ్మర్‌లో కూల్‌‌గా ఉండే ప్రదేశాల్లో ఎంజాయ్ చేయాలనుకునేవారు షిమ్లా ట్రిప్‌కు వెళ్లొచ్చు.

జైపూర్, రాజస్థాన్
రాజస్థాన్‌లో ఉండే జైపూర్‌ను సింగార దేశం అని కూడా పిలుస్తారు.ఇక్కడ హవా మహల్, అంబర్ కోట వంటి చారిత్రక స్థలాలు ఉంటాయి. టూరిస్ట్ సపోర్ట్ సెంటర్‌లు ఉండడంతో ఈ ప్రాంతాల్లో సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలానుకునే వారికి, ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్లి రావాలి అనుకునే వారికి జైపూర్ బెస్ట్ ఆప్షన్.

ALSO READ: సమ్మర్‌లో ఆ ప్లేస్‌కి వెళ్తే వచ్చే కిక్కే వేరప్ప..!

మసూరీ, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లో ఉన్న మసూరీని క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే కెంప్టీ ఫాల్స్, గున్ హిల్ వంటి ప్రదేశాల్లో ప్రకృతి అందాలు చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం టూరిస్ట్ సేఫ్టీపై కట్టుబడి ఉంది. ఇక్కడ రోడ్ సేఫ్టీ, హెల్ప్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

కాన్యాకుమారి, తమిళనాడు
తమిళనాడలో ఉండే కాన్యాకుమారి కూడా సేఫ్ టూరిజంను ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఉండే వివేకానంద రాక్ మెమోరియల్‌
సౌత్ ఇండియాలో ఉన్న ఫేమస్ సీసైడ్ ప్లేస్. ఇక్కడ కూడా సముద్ర ఒడ్డున భద్రతా బలగాలు, పోలీస్ మేనేజ్‌మెంట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్‌ల కోసం సురక్షితంగా మార్చారు.

పహల్గమ్ ఘటన టూరిస్ట్‌లలో భయాన్ని పెంచినా, భారతదేశంలో ఇంకా అనేక సురక్షితమైన, ఆకర్షణీయమైన పర్యటనా స్థలాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు, ప్రభుత్వ సహాయంతో టూరిస్ట్‌లకు ఆనందకరమైన అనుభవాన్ని అందిస్తాయి. అయితే ఈ ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తున్న వారు స్థానిక హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయడం ఉత్తమం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు భద్రతా సమాచారాన్ని చెక్ చేసుకోవడం మంచిది.

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×