Telugu Serial: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటు, వినోదాన్ని పంచుతున్న వాటిలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ఉన్నాయి.. తెలుగులో ఎక్కువగా సీరియల్స్ జనాలని బాగా అలరిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈమధ్య వస్తున్న సీరియల్స్ కంటెంట్ తో పాటు కాస్త కామెడీ రొమాన్స్ కూడా ఎక్కువగా పండించడంతో జనాలు సినిమాలతో పాటు సీరియల్స్ ని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. స్టార్ మా తో పాటు.. తెలుగులో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఈమధ్య టీఆర్పి రేటింగ్ కోసం ఒక్కో సీరియల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు దర్శకులు. తాజాగా ఓ సీరియల్ లో బోల్డ్ సీన్స్ ని ఎక్కువగా పెట్టడంతో ప్రస్తుతం ఆ సీరియల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జీతెలుగు లో ప్రసారం అవుతున్న సీరియల్..
తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్న ప్రముఖ టీవీ ఛానెల్స్ లలో జీతెలుగు ఒకటి. ఈ ఛానల్ ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించిన సీరియల్స్ నని ప్రసారం చేస్తుంది. ఈ మధ్య కాస్త ట్రెండు మారినట్టు ఉంది. యూత్ ని కూడా ఆకట్టుకునే విధంగా సీరియల్స్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో ఒకటి పడమటి సంధ్యారాగం కూడా ఒకటి.. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు సంబందించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో రామ లక్ష్మీ అనుకోని అష్మితను వెనుక నుంచి గట్టిగా పట్టుకుంటాడు. నిన్ను ఏదైనా చెయ్యాలంటే నువ్వు మాట్లాడకూడదు అని అంటాడు సౌర్య. అది కాస్త రొమాంటిక్ గా ఉంటుంది.. ఆ సీన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్..
Also Read :ప్రవస్తికి గట్టిగా తగిలేట్టుగానే ఇచ్చిన సునీత.. ఫ్యూజులు అవుట్ అయినట్లే..?
నెటిజన్స్ రియాక్షన్ ఏంటంటే..?
ఈ సీన్ చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.. చూసే జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు కదరా.. చీకట్లో ఆ మాత్రం జుట్టు కూడా కనిపించలేదా ఎవరు ఏంటని కూడా తెలియకుండానే సీన్ చేశారా అంటూ ఓ నెటిజను కామెంట్ చేశారు. మరొకరి ఛీ ఛీ ఏంటి దరిద్రం.. ఏం చేస్తున్నారు. మిమ్మల్ని చంపెయ్యాలి అంటూ కామెంట్ చెయ్యగా, వీళ్ళు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం. త్వరగా లైట్ ఏసి వాళ్ళని చూసుకునేలా చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సీరియల్ పై కొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తే.. ఈ సీన్ చూసిన తర్వాత నెగిటివ్గా కామెంట్లు వస్తున్నాయి.. మొత్తానికి ఈ వీడియో క్లిప్ అయితే సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది.. ఆ సీన్ ఏంటో మీరు కూడా ఇటు లుక్ వేసుకోండి..
?igsh=bmZxdGpra2tucWQ1