HHVM Climax Changed in OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (ఆగష్టు 22) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ వచ్చేసింది. అయితే కన్నడ భాష మినహా మిగతా అన్ని భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. అయితే హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తోన్న ఫ్యాన్స్‌కి మేకర్స్ షాకిచ్చారు. థియేటర్ వెర్షన్‌ని పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చారు. అసుర హననం పాటతోనే ఓటీటీ వెర్షన్‌కి ఎండ్ కార్డు వేశారు. అయితే దీనిపై మూవీ లవర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పవన్, బాబీ డియోల్ సీన్ పెట్టాల్సిందని, అదే మూవీకి మంచి క్లైమాక్స్ అని చర్చించుకుంటున్నారు.
ఆ సీన్ కట్
కనీసం పవన్ ఢిల్లి వెళ్లిందైన చూపించి ఉంటే బాగుండేదంటున్నారు. క్లైమాక్స్ అసలు సంతృప్తి లేకుండ ఉందని అంటున్నారు. కాగా క్లైమాక్స్‌లో అసుర హననం పాట తర్వాత వీరమల్లు.. ఔరంగ జేబును కలిసేందుకు ఢిల్లీ బయలుదేరుతారు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్, హీరో ఢిల్లీ ప్రయాణం మూవీకి ల్యాగ్ అనిపించింది. ఈ సమయంలో వచ్చిన వీఎఫ్ఎక్స్ దారుణం అనిపించాయి. ఇదే మూవీకి పెద్ద మైనస్ అయ్యింది. అందుకే ఓటీటీ వెర్షన్‌లో మేకర్స్ ఈ సీన్‌ని కట్ చేశారట. కానీ, క్లైమాక్స్‌లో సీన్ ఫుల్‌గా ఉంచకపోయినా.. పవన్ ఢిల్లీ వెళ్లిన సీన్ అయిన చూపించి ఉంటే పార్ట్ 2 మరింత ఆసక్తికరంగా ఉండేదని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓటీటీ వెర్షన్‌లో అసుర హనననంతోనే మూవీకి ఎండ్ కార్డు వేసి పార్ట్ 2ని ప్రకటించారు.
క్రిష్ కథను పూర్తి మార్చేశారా?
కానీ దీనికి క్లైమాక్స్‌లో పవన్ ఢిల్లీ చేరుకున్నట్టు ఒక్క సీన్‌తో క్లైమాక్స్ మార్చి ఉంటే బాగుండేదని, కనీసం ఈ సినిమా ఓటీటీలో అయిన హిట్ అయ్యేందంటున్నారు ఓటీటీ ప్రీయులు. క్లైమాక్స్ మార్చి ఫ్యాన్స్‌కి ఆ ఒక్క సంతృప్తి కూడా లేకుండా చేశారంటూ మేకర్స్‌పై అసహనం చూపిస్తున్నారు. కాగా మొదట ఈ చిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకోవడం నిర్మాత ఏఏమ్ రత్నం కుమారుడు, డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ చిత్రంలో మొదట డైరెక్టర్ క్రిష్ అనుకున్న కాన్సెప్ట్‌ని పూర్తిగా మార్చేశారట. స్వాతంత్ర్య సమరమోధుడైన వీరమల్లుకు, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా డైరెక్టర్ క్రిష్ మూవీ కథ రాసుకున్నారు.
అయితే ఇందులో పలు మార్పులు చేసి సినిమాను ప్రస్తుతం సనాతన ధర్మం కాన్సెప్ట్‌ని టచ్ చేశారు. ఇది హీరో పవన్ కళ్యాణ్ సూచన మేరకు చేసినట్టు సమాచారం. అలాగే ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ని కూడా పవన్ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. అలా హరి హర వీరమల్లు మూవీ కాన్సెప్ట్ మార్చి సనాధన ధర్మం కాన్సెప్ట్ టచ్‌తో హరి హర వీరమల్లును ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే రిలీజ్ తర్వాత మూవీపై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయిన.. సెకండాఫ్ అభిమానులను దారుణంగా నిరాశ పరిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పవన్ ఢిల్లీకి వెళ్లేటప్పుడు వచ్చిన పాట ప్రతి ఆడియన్స్‌కి బోర్ కొట్టించింది. అంతేకాదు ఈ సన్నివేశంలో వాడిన వీఎఫ్‌ఎక్స్ దారుణంగా ఉంది. దీంతో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయయింది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం మూవీ బయ్యర్లు నష్టపోయారు. ఫలితం హరి హర వీరమల్లు ప్లాప్‌గా నిలిచింది.