Gold Rate Today: అబ్బా.. చల్లని కబురు.. బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు బంగారం ధరలు దూసుకుపోయాయి.. కానీ గత రెండు రోజులుగా మళ్లీ తగ్గుతున్నాయి. ఇక పసిడి ప్రియులకు పండగే అంటున్న నిపుణులు.. అయితే నిన్న అనగా మంగళవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,750 ఉండగా.. నేడు బుధవారం 10 గ్రాముల తులం బంగారం ధర రూ.1,00,150 వద్ద పలుకుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,350 కాగా.. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ. 91,800 వద్ద ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 తగ్గింది.
దిగివస్తున్న బంగారం ధరలు..
నిన్నమోన్నటి వరకు బంగారం ధరలు పగబట్టినట్టుగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అది కాకుండా శ్రావణ మాసం అంటే శుభకార్యాల వేళ అంటారు. ఈ మాసంలో అనేక శుభకార్యాలు జరుగుతాయి. అయితే ఈ శుభకార్యాల సమయంలో బంగారం భారీగా రేటు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరీ సామాన్య ప్రజలు అయితే వాటి వైపు చూడాలన్ని భయపడుతున్నారు. కానీ ఇప్పడు బంగారం ధరలు తగ్గడం వల్ల పసిడి ప్రియులలో కొంత భయం తగ్గింది. అయితే బంగారం ధరలు ఇలాగే తగ్గుతాయా? లేదంటే మళ్లీ పెరుగుతాయా? అని ప్రజలు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు..
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, టారిఫ్ యుద్ధాలు వంటివి ఈ అస్థిరతకు కారణమయ్యాయి. డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
నిన్నటి బంగారంతో .. నేటి బంగారం ధరలు పోల్చగా నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,750 కాగా.. నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,150 వద్ద కొనసాగుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,350 కాగా.. నేడు రూ.91,800 పలుకుతోంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,150 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,800 వద్ద ఉంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,150 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర తులం బంగారం ధర రూ.91,800 వద్ద కొనసాగుతోంది.
ముంభై బంగారం ధరలు
ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,150 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,800 వద్ద పలుకుతోంది.
ఢీల్లీ బంగారం ధరలు
ఢీల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,300 కాగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,950 వద్ద ఉంది.
Also Read: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?
నేటి సిల్వర్ ధరలు..
బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.. నిన్నటి మోన్నటి వరకు బంగారం, సిల్వర్ ధరలు తగ్గేదేలే అంటూ పెరుగుతు పోయాయి. ఇప్పడు రెండు మళ్లీ తగ్గుతున్నాయి. అయితే నిన్న కేజీ సిల్వర్ ధర రూ.1,26,000 వద్ద ఉండగా.. నేడు కేజీ సిల్వర్ ధరలు రూ.1,25,000 వద్ద కొనసాగుతుంది. అంటే కేజీపై రూ.1000 తగ్గిందని చెప్పవచ్చు. అలాగే కలకత్త, ముంభై ప్రాంతాల్లో రూ.1,15,000 కొనసాగుతోంది.