E-Paper
Advertisement

పెళ్లి పీటలెక్కడానికి ముందే పెను విషాదం… తెలుగులోనే స్ట్రీమింగ్

పెళ్లి పీటలెక్కడానికి ముందే పెను విషాదం… తెలుగులోనే స్ట్రీమింగ్
Advertisement

Heart Touching Telugu Movie : ఓటీటీలో జూన్ 21 నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మెడికో లవ్ ఫ్యామిలీ డ్రామా ‘సిస్టర్ మహి (Sister Mahi). దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కథ, స్క్రీన్‌ప్లే అందించి స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో సాధారణ నర్స్ జీవితంలోని హృదయ విదారక సంఘటనలు, త్యాగాలు, ప్రేమ, కుటుంబ బంధాలను చాలా ఎమోషనల్‌ గా తెరకెక్కించారు. సవతి తల్లి టార్చర్, ప్రేమ, విషాదం మధ్య సాగే ఈ కథ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తుంది. మరి ఇంతకీ ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ప్రధానంగా మహి (ప్రీతి నేహా) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రిలో నర్స్‌ గా పని చేస్తూ, రోగులకు సేవ చేయడం తన ఉద్యోగం మాత్రమే కాదని, అది తన ధర్మమని బలంగా నమ్మే మంచి మనసున్న గుణవంతురాలు మహి. ఆసుపత్రిలోనే ల్యాబ్ టెక్నీషియన్‌ గా పని చేసే సూర్యతో ఆమె ప్రేమలో పడుతుంది. వారిద్దరి మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమ, చిన్న చిన్న సంతోషాలు, భవిష్యత్ కలలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని రోజుల ముందు వారి జీవితాల్లో ఒక భయంకరమైన విషాదం చోటు చేసుకుంటుంది.

Advertisement

మహి రోడ్డు దాటుతున్నప్పుడు ఘోర ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత సూర్య జీవితం ఎలా మారింది ? మహి కుటుంబ నేపథ్యం ఏంటి ? సవతి తల్లి ఆమెను పెట్టిన టార్చర్ ఏంటి ? అనే అంశాలన్నీ ఎంతో ఎమోషనల్ ట్విస్టులతో సాగుతాయి. ఒక సాధారణ నర్స్ జీవితంలోని కష్టాలు, త్యాగాలు, సమాజంలో నర్సుల పాత్ర ప్రాముఖ్యతను ఈ చిత్రం ద్వారా హృదయానికి హత్తుకునేలా చూపించారు.

ఎక్కడ చూడవచ్చు అంటే ?

మహి పాత్రలో ప్రీతి నేహా అద్భుతమైన ఎమోషనల్ డెప్త్ ఇచ్చి మెప్పించింది. సూర్య పాత్రలో దీక్షిత్ సహజంగా నటించాడు. భాస్కర్, రాజ్‌కుమారి, మధులిక శర్మ, రామ్ చరణ్, సమన్వి పవార్ సపోర్టింగ్ కాస్ట్‌ గా నటించారు. ఇక సాయి మధుకర్ అందించిన సంగీతం మరియు పాటలు సినిమాకు ప్రధాన బలం. వివమ్, బృందా ఆలపించిన ఎమోషనల్ పాటలు హృదయాన్ని తాకుతాయి. నర్సుల జీవితాలు, వారి త్యాగాలు, సమాజంలో వారి ప్రాముఖ్యతను చూపించే సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమా హృదయానికి హత్తుకునే ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, రాఘవేంద్రరావు స్టైల్‌ లోని సున్నితమైన కథనం, అసభ్యకర కంటెంట్ లేకుండా కుటుంబంతో కలిసి చూడగలిగే క్లీన్ ఎంటర్‌టైనర్.

ఎక్కడ చూడాలి?

Advertisement

ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. కథా సుధ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం వీకెండ్‌ లో కుటుంబంతో కలిసి చూడదగ్గ మంచి హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

Tags

Related News

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ

ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

రిసార్ట్‌కు రిలాక్స్ అవ్వడానికెళ్తే ఇదేం ట్విస్ట్ భయ్యా… ఊహించని క్లైమాక్స్

పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

ఇది రివెంజ్ కాదు ఊచకోత… తండ్రి కోసం కొడుకు బ్లడీ బ్లడ్ బాత్… ఈ థ్రిల్లర్ మిస్ అవ్వొద్దు

8 ఏళ్ల బాబు చెప్పిన కథలు విని పోలీసులే షాక్… చివర్లో వచ్చే ట్విస్ట్ కి దిమాక్ కరాబ్

తరతరాలుగా వెంటాడే శాపం… ఆ ఇంటి తలుపు తెరిచిన క్షణం నుంచే అసలు హారర్

Big Stories

Advertisement
×