Toxic Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF సిరీస్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు,ముఖ్యంగా KGF 2 బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టి తొలిసారి సాండల్ వుడ్ కి వెయ్యి కోట్ల రుచి చూపించింది.దీంతో యష్ ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి దూసుకొచ్చాడు. రాఖీ భాయ్ గా ఊహించని ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు.ఇక తెలుగులోనూ ఈ సినిమా దాదాపు 80కోట్ల పై చిలుకు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలకి పెద్ద షాక్ ఇచ్చింది.
ఇదిగో దీన్నే పసిగట్టాడు దిల్ రాజు.ఇంకేం మోస్తరు అంచనాలు ఉన్న సినిమాకే ఆడియన్స్ 80 కోట్లు ఇచ్చారంటే ఇక భారీ అంచనాలతో KGF 2 తర్వాత వస్తున్న సినిమాకి ఇంకెంత వసూలు చేయచ్చో అని ఊహాలోకంలో తెలిపోయాడు.సినిమా ఏ మాత్రం సక్సెస్ టాక్ చూసినా ఈజీగా రెండొందల కోట్లు వెనకేయోచ్చని లేక్కేశాడు.అందుకే KVN వంద కోట్ల నెంబర్ చెప్పినా ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్ళిపోయాడన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
ALSO READ :టాక్సిక్‌కు టికెట్ రేట్లు పెంచేశారు.. ఎంతంటే?
అసలే రాఖీ భాయ్ గా దుమ్ము రేపిన యష్ ఒకవైపు, రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా కురేషీ, తారా సుతారియా ..అంటూ ప్యాన్ ఇండియా టాప్ బ్యూటీస్ ఇంకోవైపు ,మరో వైపు అంచనాలు పెంచేసిన ట్రైలర్, ఆశలు పెంచేసిన అడల్ట్ కంటెంట్ ..ఎటు తిరిగి చూసినా సినిమా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులపడం పక్కా అనుకున్నాడు.కాని సినిమా మొదటి ఆట పడిందో లేదో పెదవి విరిచేశారంతా,స్టైల్ కాదు బాస్ సోల్ ఉండాలంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.
మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి కథ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ ,అడల్ట్ సీన్స్ నింపేసి జనాలు ఎలా వస్తారని అనుకున్నారంటూ చెడుగుడు ఆడేస్తున్నారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న టాక్సిక్ మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో దాదాపు వంద కోట్లు కుమ్మరించిన దిల్ రాజు పరిస్థితి ఏంటా అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారు.
పైగా ఇరుముడి సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతుంది.టాక్సిక్ వస్తుండటంతో రవితేజ సినిమాకి థియేటర్లు తగ్గించారు కూడా.ఇక ఇపుడు టాక్సిక్ నెగెటివ్ టాక్ మూటగట్టుకోవడంతో మళ్ళీ ఆ థియేటర్లు అన్ని ఇరుముడికే వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది.
అలా కాకుండా ఇంకా టాక్సిక్ సినిమాకే హోల్డ్ చేస్తే మాత్రం మంచి ఆడుతున్న ఇరుముడిని కాదని, ప్లాప్ టాక్ తెచ్చుకున్న టాక్సిక్ ని వేయడం ఏంటి ?అంటూ ఎకిపారేసే ప్రమాదం ఉంది.కొన్ని సొంత థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాటిలో ఆడించే అవకాశాలు ఎక్కువ.
ALSO READ :ఈశ్వర్ సాయి వీడియో మళ్లీ బయటకు.. రాఖీ కట్టించుకో అంటూ…
ఇక దిల్ రాజ్ ట్రాక్ రికార్డ్ చూస్తే మొదట్లో వరుస సక్సెస్ లు చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ కి గత కొంతకాలంగా కాలం అస్సలు కలిసి రావట్లేదు. ముఖ్యంగా ఆయన బ్యానర్ లో వచ్చిన వారిసు, గేమ్ చేంజర్ సినిమాలు దిల్ రాజుకి ఒక పీడ కలనే మిగిల్చాయి.ఇక గేమ్ చేంజర్ దెబ్బకి తట్టాబుట్టా సర్దేసేవాడే వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం లేకపోయుంటే.
ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో వచ్చిన నష్టాలన్నీ ఒక్క టాక్సిక్ దెబ్బకి కవర్ చేసుకుందాం అనుకున్నాడు.కానీ టాక్సిక్ దెబ్బ ఈ రేంజ్ లో కొడుతుందని అస్సలు ఊహించలేదు కాబోలు. చూడాలి మరి డివైడ్ టాక్ తెచ్చుకున్న టాక్సిక్ రెండో రోజుకి ఏదైనా మిరాకిల్ జరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో !