OTT Movie : భాష ఏదైనా హర్రర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ అవార్డులు రివార్డులు అందుకున్న సినిమా అంటే ఇంట్రెస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఏకంగా IMDb ప్రకారం మొత్తం 59 అవార్డులు, 184 నామినేషన్స్ పొందిన ఓ హారర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ హాలీవుడ్ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఇండియాలో స్ట్రీమింగ్ కు సిద్ధం
అమెరికన్ హారర్ చిత్రం ‘నోస్ఫెరాటు’ (Nosferatu). రాబర్ట్ ఎగ్గర్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1922లో విడుదలైన జర్మన్ సైలెంట్ ఫిల్మ్, బ్రామ్ స్టోకర్ ‘డ్రాకులా’ నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో బిల్ స్కార్స్‌గార్డ్ కౌంట్ ఓర్లాక్ (నోస్ఫెరాటు) పాత్రలో, లిలీ-రోజ్ డెప్ ఎల్లెన్ హట్టర్‌గా, నికోలస్ హౌల్ట్, ఆరోన్ టేలర్-జాన్సన్, ఎమ్మా కొరిన్, రాల్ఫ్ ఇనెసన్, సైమన్ మెక్‌బర్నీ, విల్లెం డఫో తదితరులు నటించారు.
ఈ చిత్రం 2024 డిసెంబర్ 2న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అదే ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఇక ఇప్పుడు ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. రాబర్ట్ ఎగ్గర్స్ ‘నోస్ఫెరాటు’ మూవీ మే 10 నుండి జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ చిత్రం 2025 జనవరి 21 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఐట్యూన్స్, వుడు, గూగుల్ ప్లే మూవీస్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అద్దెకు అందుబాటులో ఉంది.
‘నోస్ఫెరాటు’ ఇప్పటివరకు రాబర్ట్ ఎగ్గర్స్ నటించిన సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. బాక్సాఫీస్ వద్ద 181 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఉత్కంఠభరితమైన ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వాంపైర్ తదితర అంశాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్ కేటగిరీల్లో ఈ మూవీకి ఆస్కార్ నామినేషన్లు కూడా దక్కాయి. అయితే ఒక్క ఆస్కార్ ను కూడా ఈ మూవీ దక్కించుకోలేకపోయింది.
కథలోకి వెళ్తే…
ఎల్లెన్ అనే అమ్మాయి చిన్నప్పుడు అనుకోకుండా కౌంట్ ఓర్లాక్ (బిల్ స్కార్స్‌గార్డ్) అనే పురాతన వాంపైర్‌తో ఒక టెలిపతిక్ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంబంధం ఆమెను జీవితాంతం హింసిస్తుంది. ఇది ఆమెకు భయంకరమైన ఫిట్స్, మానసిక అలజడిని కలిగిస్తుంది.
ఎల్లెన్ భర్త థామస్ హట్టర్ (నికోలస్ హౌల్ట్), ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. తన యజమాని హెర్ నాక్ (సైమన్ మెక్‌బర్నీ) ఆదేశాల మేరకు ఓర్లాక్ కోటకు వెళతాడు. విస్బర్గ్‌లో ఒక ఇంటిని కొనాలని కోరుకుంటాడు. ట్రాన్సిల్వేనియాలో థామస్ ఓర్లాక్ కు సంబంధించిన భయంకరమైన సీక్రెట్ ను తెలుసుకుంటాడు. దీంతో అతన్ని వాంపైర్‌గా అనుమానిస్తాడు.
Read Also : ఏసీ వేస్తే చచ్చిపోయింది మావా… ఇదెక్కడి వింత రోగం… అంతుచిక్కని మిస్టరీతో ఓటీటీలో పిచ్చెక్కిస్తున్న మూవీ
మరోవైపు ఓర్లాక్ ఎల్లెన్‌పై మోహంతో ఆకర్షితుడై, ఆమెను మానసికంగా బాధిస్తాడు. అతను విస్బర్గ్ కు చేరుకుని, అక్కడ ప్లేగును వ్యాపింపజేసి, అందరూ చనిపోయేలా చేస్తాడు. ఈ క్రమంలోనే ఎల్లెన్ కు గతంలో ఓర్లాక్‌తో ఉన్న సంబంధం గుర్తొస్తుంది. అతనేమో ఆమెను తన “సోల్‌మేట్”గా భావిస్తాడు. మరి చివరికి ఈ ఓర్లాక్ తో ఆమె ప్రేమలో పడిందా? అతను ఎందుకు అందరినీ చంపేస్తున్నాడు? హీరోయిన్ భర్త ఏమయ్యాడు? వంటి విషయాలు తెలియాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ అండ్ సీ.