Shami Threat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో మహమ్మద్ షమీ కి ( Shami Threat )ఊహించని పరిణామం ఎదురైంది. మహమ్మద్ షమీని చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం జరిగే పరిధిలో నెలకొన్న నేపథ్యంలో ముస్లిం మతానికి సంబంధించిన మహమ్మద్ షమీని చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో… పోలీసులు అలర్ట్ అయ్యారు. కోటి రూపాయలు ఇవ్వకపోతే టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీని ( Mohammad shami) బెదిరిస్తామని… బెదిరింపులకు దిగారు దుండగులు.
Also Read: Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే
ఆదివారం రోజున సాయంత్రం రాజపుత్ సింధార్ నుంచి మహమ్మద్ షమీ కి మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై వెంటనే అలర్ట్ అయిన మహమ్మద్ షమీ కుటుంబం…. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహమ్మద్ షమీ హైదరాబాదులో ఉన్న నేపథ్యంలో అతని సోదరుడు హసీబ్ అహ్మద్…. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ బెదిరింపులకు సంబంధించిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహమ్మద్ షమీ ఓ ముస్లిం క్రికెటర్ అయినప్పటికీ.. టీమిండియాలో అద్భుతంగా ముందుకు సాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో కూడా మంచి ధర దక్కించుకొని… హైదరాబాదులో రాణిస్తున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ షమీని చంపేస్తామని బెదిరించడం వెనుక పెద్ద కుట్రే ఉందని… కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మహమ్మద్ షమీ కి పాకిస్తాన్ నుంచి బెదిరింపులు?
మహమ్మద్ షమీని బెదిరిస్తామని… చంపేస్తామని బెదిరించిన వారు కచ్చితంగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వారేనని… కొంతమంది ఆయన ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో…. మహమ్మద్ షమీని చంపే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పహల్ గామ్ సంఘటనలో జరిగినట్లే… మహ్మద్ షమీపై దాడులు చేసే ప్రమాదం కూడా పొంచి ఉందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో భద్రత పెంచాలని.. షమీకి హై సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇది ఇలా ఉండగా…. ఇవాళ సన్రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు…. అద్భుతంగా రానించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 133 పరుగులకు కట్టడి చేసింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లు వాడి వేడి వికెట్ నష్టపోయి 133 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో పెద్దగా రాణించని బౌలర్లు… ఇవాల్టి మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించారు. ఈ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్… 133 పరుగులకే ప్యాకప్ చెప్పింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 134 పరుగులు చేస్తే హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొడుతుంది.