Friday OTT Releases : ఓటీటీలలో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 20 కి పైగా సినిమాలు అడుగు పెట్టాయి. గురువారం, శుక్రవారం కలిపి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఈ వీకెండ్ ఓటీటీ మూవీ లవర్స్ కి సినిమాల జాతర ఉండబోతోంది. కానీ అందులోనూ ఈ ఫ్రైడే రాబోతున్న సినిమాలలో తెలుగు సినిమాలను మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఆ లిస్టులో ‘పుష్ప 2’ (Pushpa 2), ‘పోతుగడ్డ’ (Pothugadda), ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ (Coffee with a Killer), ‘ఐడెంటిటీ’ (Identity) వంటి సినిమాలు ఉన్నాయి. మరి ఈవారం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూసేద్దాం పదండి.
ఐడెంటిటీ
ఈ ఫ్రైడే ఓటీటీలవి అడుగుపెట్టిన థ్రిల్లర్ సినిమాలలో మలయాళ మూవీ ‘ఐడెంటిటీ’ కూడా ఒకటి. ఈ మూవీ తెలుగుతో సహా 4 భాషల్లో స్ట్రీమింగ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్రిష, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఐడెంటిటీ’ థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయిన 7 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.
పోతుగడ్డ
తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ ‘పోతుగడ్డ’ డైరెక్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. పృథ్వీ దండమూడి, విస్మయశ్రీ హీరోహీరోయిన్లుగా, ఆడుకాలం నరేన్, శత్రు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి రక్ష వీరన్ దర్శకత్వం వహించాడు.
ధూం ధాం
తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘ధూం ధాం’. థియేటర్లలో రిలీజైన 3 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
కాఫీ విత్ ఎ కిల్లర్
ఇక ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన థ్రిల్లర్ తెలుగు సినిమాలలో ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ఒకటి. ఈ సినిమా కూడా జనవరి 31 నుంచే ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో రవిబాబు, శ్రీనివాస్ రెడ్డిలాంటి వాళ్లు లీడ్ రోల్స్ పోషించారు.
ఈరోజు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్