OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ మాటల్లో చెప్పలేం. ఈ సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఎప్పటి నుండో ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలను, ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు రాత్రి పూట చూడటానికి గుండె ధైర్యం కూడా సరిపోదు. అటువంటి గూస్ బంప్స్ తెప్పించే ఒక మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హెరెడిటరీ‘ (Hereditary). ఈ మూవీకి ఆరి ఆస్టర్ దర్శకత్వం వహించారు. టోనీ కొల్లెట్, అలెక్స్ వోల్ఫ్, మిల్లీ షాపిరో, ఆన్ డౌడ్, గాబ్రియేల్ బైర్నే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో జూన్ 8, 2018న థియేట్రికల్‌గా విడుదలైంది. $87 మిలియన్లకు పైగా వసూలు చేసి, ఆ సమయంలో A24లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
యాని అనే మహిళకు పీటర్, చార్లీ ఇద్దరు పిల్లలు ఉంటారు. ఈమె తల్లి చనిపోవడంతో అంతిమ సంస్కారాలు చేస్తారు. అయితే యాని తన తల్లి ఏవో క్షుద్ర పూజలు చేసేదని తెలుసుకుంటుంది. ఈ క్రమంలో చార్లీ వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన చార్లీ, ఒక పక్షితలను విరిచి తన జేబులో పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన తల్లి ఆశ్చర్యపోతుంది. తన కొడుకు పీటర్ పార్టీకి వెళ్తున్నాడని తెలుసుకొని, చార్లీని కూడా తీసుకు వెళ్ళమంటుంది . చార్లీ పార్టీ మధ్యలోనే తనకేదో అవుతుందని పీటర్ కి చెప్తుంది. వెంటనే కారులో నుంచి చార్లీని ఇంటికి తీసుకు వెళుతూ ఉంటాడు. ఊపిరి ఆడక చార్లీ కారులో నుంచి తలను బయటకి పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో చార్లీ తల తెగిపడుతుంది. ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు చాలా బాధపడతారు. పీటర్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లి పోతాడు.
ఆ తర్వాత యానికి, జోన అనే మహిళ పరిచయం అవుతుంది. ఆత్మలతో మాట్లాడవచ్చు అని చెప్తుంది. అలా ఆమె నుంచి ఆత్మతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటుంది. ఇంటికి వెళ్లి అదే పద్ధతిని పాటిస్తుండగా, తన కూతురు మాట్లాడినట్టు వినపడుతుంది. ఈ క్రమంలో ఆమె భయంకరంగా ప్రవర్తించడంతో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా భయపడతారు. భర్త ఆమె మీద నీళ్లు పోయాగానే మళ్లీ మామూలే అయిపోతుంది. ఆ తరువాత యాని పీటర్ మీద కూడా చేతబడి చేస్తున్నారని తెలుసుకొంటుంది. ఈ పని ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకుంటుంది. చివరికి యాని తెలుసుకునే సెక్రెట్స్ ఏమిటి? పీటర్ మీద చేతబడి ఎందుకు చేస్తున్నారు? యాని కుటుంబంలో ఆత్మల వల్ల ఏమి సమస్యలు వస్తాయి? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.