Brahmamudi serial today Episode: కావ్య కాఫీ తీసుకుని వస్తుంది. రాజ్ ఇంకా పడుకుని ఉండటం చూసి నిద్ర లేపుతుంది. ఆఫీసుకు వెళ్లాలి లేట్ అవుతుంది అని చెప్పగానే.. ఒక గంట తర్వాత లేస్తాను అంటాడు రాజ్. కావ్య వినకుండా రాజ్ మీద పడుకుని మరీ రొమాంటిక్‌గా నిద్ర లేపుతుంది. నిద్ర లేచిన రాజ్ వెంటనే రెడీ అయి ఆఫీసుక బయలుదేరుతాడు. ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తుంటారు. రాజ్ కారులో స్పీడుగా వెళ్తుంటే ఏవండి ఏంటా స్పీడు.. అంటుంది కావ్య.
లేటయింది కదా..? అందుకే స్పీడు అంటాడు రాజ్. మనం లేట్ రాజ్, లేట్ కావ్య కాకూడదంటే ముందు స్పీడు ఆపండి అంటుంది కావ్య. అయినా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఫైల్ ఉండాలి కదా..? మీరు లేటుగా లేచారు. లేటుగా ఆఫీసుకు బయలుదేరారు అంటుంది. రాజ్ కారు ఆపగానే.. కావ్య దిగి తాను ఇంటికి వెళ్లి ఫైల్ తీసుకుని వస్తాను.. మీరు ఆఫీసుకు వెళ్లండి అని చెప్పి వెళ్లిపోతుంది.
ఆఫీసుకు వచ్చిన రాజ్.. శృతిని పిలిచి లోపలున్న నగలన్నీ తీసుకొచ్చి బయట కాన్ఫరెన్స్ హాల్ లో పెట్టించు అంటాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ అనామికకు ఫోన్ చేసి కావ్య ఆఫీసుకు రాలేదని చెప్తాడు. దీంతో అనామిక షాక్ అవుతుంది. సరే నేను చూసుకుంటానులే.. అంటుంది. ఏమైందని సామంత్ అడిగితే.. ఆ కావ్య ఆఫీసుకు రాలేదంట అని చెప్తుంది. కావ్య ఆఫీసుకు వస్తే ఏంటి..? రాకపోతే మనకేంటి అంటాడు సామంత్. ఇంతలో అనామిక, కావ్యకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు మేడం.. ఇప్పుడు బెస్ట్ డిజైనర్ అవార్డు అందుకోనున్నావా..? నువ్విలా బయట ఉండి నన్ను డిస్టర్బ్ చేస్తే ఎలా అని అడుగుతుంది అనామిక.
కొంచెం కాదు బాగా డిస్సపాయింట్ అవ్వడానికి రెడీ అవ్వు ఇంకాసేపట్లో నేను గెలవబోతున్నాను అని కావ్య చెప్పగానే.. ఇంకాసేపట్లో మీ ఆఫీసులో మీకు నష్టం జరగబోతుంది. మీరు రోడ్డు మీదకు రాబోతున్నారు అంటుంది అనామిక. నన్ను అవమానించి మీరంతా సంతోషంగా ఉంటుంటే.. నేను చూస్తూ ఊరుకుంటానా..? అందుకే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూశాను. అందుకే ఇప్పుడు నా టైం వచ్చింది ముందు నువ్వు త్వరగా వెళ్లు నీ మొగుడు మాత్రమే అవమానాలు పడితే ఎలా చెప్పు ఇద్దరూ కలిసి తనివితీరా అనుభవించండి.. అంటూ ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే కావ్య రాజ్‌కు ఫోన్ చేస్తుంది. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. జగదీష్ రావడంతో హాల్లోకి వెళ్లి నగలు చూపిస్తుంటారు.
నగలు చూపించి ఎలా ఉన్నాయి సార్ అని రాజ్ అడగ్గానే.. చాలా బాగున్నాయి అంటూ మెచ్చుకుంటారు. తనతో పాటు వచ్చిన అప్రైజర్ నగల క్వాలిటీ చెక్ చేస్తారు. జస్ట్ ఫార్మాలిటీ అంతే అని చెప్పగానే సరే సార్ అంటాడు. అప్రైజర్ చెక్ చేస్తూ.. కిరీటం చెక్ చేసి అనుమానంగా చూస్తుంటాడు.. ఏమైందని జగదీష్ అడగ్గానే.. ఈ కిరీటం గోల్డ్ ది కాదు సార్ నకిలీది.. అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. అలా జరగదు వందేళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీలో నకిలీ అనడం కరెక్టు కాదు..మీరు మళ్లీ చెక్ చేయండి అంటాడు జగదీష్. నేను రెండు సార్లు చెక్ చేశాకే చెప్తున్నాను సార్ అంటాడు అప్రైజర్.
ఏంటి రాజ్ కిరీటం డమ్మీది పెట్టారా..? అని జగదీష్ అడగ్గానే లేదని వర్జినల్ అని చెప్తాడు రాజ్. ఏంటి రాజ్ దుగ్గిరాల సీతారామయ్య స్థాపించిన కంపెనీలో ఇంత ఫ్రాడ్ ఎలా చేయాలనుకుంటారు..? అంటూ నిలదీస్తాడు. క్వాలిటీ చెక్ చేయకుండా మిమ్మల్ని నమ్మి గుడికి సమర్పిస్తే నా పరిస్థితి ఏంటి అసలు వర్జినల్ కిరీటం ఏమైంది చూపించు అంటూ జగదీష్ అడగ్గానే.. ఇంతలో కావ్య వస్తుంది. మీ బాబాయ్ గారిలాగే నీఉక మతిమరుపు వచ్చిందని నాకు అర్తమైంది.
డెమో కోసం పెట్టిన కిరిటాన్ని ఇక్కడ పెట్టారా..? అసలైన కిరీటం లాకర్ లో ఉంది. సెక్యూరిటీ పర్పస్ కోసం ఇలా చేస్తుంటాము అని మీరే రండి వచ్చి వర్జినల్ కిరీటం తీసుకువద్దురు రండి అంటూ రాజ్ ను తీసుకుని వెళ్లి వర్జినల్ కిరీటం తీసుకొస్తారు రాజ్, కావ్య. అప్రైజర్ చెక్ చేసి చూసి ఇది నిజమైన వర్జినల్ గోల్డ్ అని చెప్పగానే జగదీష్ సారీ చెప్తాడు. అంతా బయట నుంచి గమనిస్తున్న సెక్యూరిటీ పక్కకు వెళ్లి అనామికకు ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం చెప్తాడు. దీంతో అనామిక షాక్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?