E-Paper
Advertisement

గతంలో జరిగిన నేరం… వర్తమానంలో వెంటాడిన శాపం… మస్ట్ వాచ్ హారర్

గతంలో జరిగిన నేరం… వర్తమానంలో వెంటాడిన శాపం… మస్ట్ వాచ్ హారర్
Advertisement

Horror Thriller OTT:  హారర్ సినిమాలు చాలానే వస్తుంటాయి. కానీ కొన్ని చిత్రాలు జంప్ స్కేర్స్‌తో కాదు… నెమ్మదిగా పెరిగే భయంతో ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోబెడతాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి శబ్దం, ప్రతి నీడ వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే భావన కలిగిస్తాయి. అలాంటి సైకలాజికల్ హారర్ అనుభూతిని అందించే చిత్రాల్లో ‘ది పాస్ట్’ (The Past) ఒకటి. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? వంటి వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సిమ్రాన్ ఓ యువ రచయిత్రి. కొత్త హారర్ నవల కోసం ఆసక్తికరమైన కథను వెతుకుతున్న సమయంలో ప్రముఖ పబ్లిషర్ యువరాజ్ ఆమెను సంప్రదిస్తాడు. తన దగ్గర ఉన్న ఒక ఐడియాతో పుస్తకం రాయాలని సూచిస్తూ, ప్రశాంతమైన వాతావరణం కోసం లోనావాలాలో ఉన్న తన పాత బంగ్లాలో ఉండమని ఆహ్వానిస్తాడు.

Advertisement

తన చెల్లెలు ఆలియాతో కలిసి ఆ బంగ్లాకు చేరుకున్న సిమ్రాన్ మొదట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోదు. కానీ మొదటి రాత్రే వింత సంఘటనలు మొదలవుతాయి. ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అడుగుల శబ్దాలు వినిపించడం, కనిపించని నీడలు వెంటాడటం, ఎవరో తనను గమనిస్తున్నారనే విచిత్రమైన అనుభూతి ఆమెను భయపెడుతుంది.

మొదట ఇవన్నీ భ్రమలేనని భావించిన సిమ్రాన్… రోజులు గడిచేకొద్దీ ఆ ఇంట్లో ఏదో అతీంద్రియ శక్తి ఉందని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. భయం పెరుగుతున్న కొద్దీ బంగ్లా గతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడ ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషాదకర సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.

Advertisement

ఆలియా ప్రవర్తన పూర్తిగా మారిపోయిన తర్వాతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆమెను ఒక దుష్టశక్తి ఆవహించినట్లు కనిపిస్తుంది. దీంతో సిమ్రాన్ తన చెల్లెల్ని రక్షించుకోవడానికి స్థానిక పూజారులు, తాంత్రికుల సహాయం తీసుకుంటుంది. అదే సమయంలో యువరాజ్ ఈ బంగ్లాకు వారిని ఎందుకు పంపించాడు ? అతనికి ఈ రహస్యంతో ఏమైనా సంబంధం ఉందా ? అనే అనుమానాలు కూడా పెరుగుతాయి.

చివరికి ఆ బంగ్లాలో తిరుగుతున్న ఆత్మ ఎవరు ? గతంలో జరిగిన విషాదానికి కారణం ఏమిటి ? సిమ్రాన్ తన చెల్లెల్ని ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడగలిగిందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘ది పాస్ట్’ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో ఉందా లేదా ?

‘ది పాస్ట్’ కమర్షియల్ హారర్ కాదు. సస్పెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన చిత్రం. 2018లో విడుదలైన ఈ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్‌కు గగన్ పూరి దర్శకత్వం వహించారు. వేదితా ప్రతాప్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దెయ్యాల కథతో పాటు గతంలో జరిగిన ఒక విషాద సంఘటనను ఆసక్తికరంగా ముడిపెడుతుంది. అసలు ఆ బంగ్లాలో ఏమి జరిగింది? అక్కడ తిరుగుతున్నది నిజంగానే ఆత్మేనా? అనే ప్రశ్నలతో సినిమా చివరి వరకు సస్పెన్స్ ను కొనసాగిస్తుంది. హారర్‌తో పాటు మిస్టరీ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో కథ చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అన్పిస్తుంది. మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఒరిజినల్ హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ లేదు. హాంటెడ్ హౌస్ కథలు, సూపర్‌నేచురల్ థ్రిల్లర్స్, సస్పెన్స్ హారర్ సినిమాల కోసమే ఓటీటీలో వెతుకుతున్న వాళ్ళకు ఇది మంచి ట్రీట్.

Read Also: 18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×