OTT Movie : పెద్దలకు మాత్రమే అనే సినిమాలలో ఓటీటీలలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయ్. అయితే ఈ సినిమాలు ఎక్కువగా క్రైమ్ జానర్ లోనే రూపొందుతుంటాయి. మరికొన్ని సినిమాలు సూపర్ న్యాచురల్ జానర్లో కూడా వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఈరోజు 2020లో రిలీజ్ అయిన ఫన్, కానీ కాంట్రవర్షియల్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ డార్క్ కామెడీ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం పదండి.
మీరట్ అనే చిన్న పట్టణంలో కథ జరుగుతుంది. ప్రధాన పాత్ర షాను (స్వారా భాస్కర్) ఒక టీచర్. ఆమె భర్త నవీన్ (ప్రవీణ్)తో పట్టణానికి వస్తుంది. షాను తన బ్యూటీ, సెన్సువలిటీతో అబ్బాయిలను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది. కానీ మహిళలు ఆమెను “హస్బెండ్ స్నాచర్”గా చూస్తారు. నంద్ (ఆయుష్మాన్ సక్సెనా) అనే యువకుడు కూడా ఆమెను ఇష్టపడతాడు. కానీ ఆమెలో రస్భరీ అనే ఆ టైప్ ఆబ్సెస్డ్ స్పిరిట్ ఉందని తెలుస్తుంది. రస్భరీ అంటే అబ్బాయిల పట్ల వ్యామోహం ఎక్కువగా ఉండే టైపు అన్నమాట.. అపరిచితుడు లాగా ఆమెలోనే రెండు పర్సనాలిటీలు ఉంటాయి. ఇది ఆమె జీవితాన్ని కాంప్లికేట్ చేస్తుంది.
తరువాత హీరోయిన్ కి ఊర్లో ఆడవాళ్లందరితో సమస్యలు మొదలవుతాయి. నంద్ తల్లి పుష్పా (నీలు కోహ్లీ) నాయకత్వంలోనే దాడి జరుగుతుంది. కానీ నంద్… షానును రక్షించడానికి ప్రయత్నిస్తాడు. మరి ఆ తరువాత ఏమైంది? హీరోయిన్ తప్పించుకుందా? ఆమె సమస్యకు కారణం ఏంటి? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.
Rasbhari అనేది ఒక హిందీ మినీ సిరీస్. ఈ సిరీస్ 8 ఎపిసోడ్‌లతో (ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాలు) ఎంగేజింగ్ గా సాగుతుంది. నికిల్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో 2020 జూన్ 25న రిలీజైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది (ప్రైమ్ మెంబర్‌షిప్‌తో). ఇందులో స్వర భాస్కర్ (షాను/రస్భరీ/నిహారికా – ట్రిపుల్ రోల్స్), ఆయుష్మాన్ సక్సెనా (నంద్), ప్రవీణ్ (నవీన్), నీలు కోహ్లీ (పుష్పా), అరుణా సోని (సపోర్టింగ్ రోల్) తదితరులు నటించారు. IMDb లో 3.9 రేటింగ్ ఉన్నప్పటికీ మ్యాడ్ హ్యూమర్, సెన్సిటివ్ థీమ్స్, పెద్దలకు మాత్రమే అనేలా మంచి మసాలా సీన్స్ గట్టిగానే ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్.