E-Paper
Advertisement

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Cyber Crime Thriller: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఒకప్పుడు ఓటీపీ చెప్పించుకుని డబ్బులు దోచుకునే మోసగాళ్లు, ఇప్పుడు పోలీసులం, సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి ప్రజలను భయపెట్టి లక్షలు, కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే ఈ కొత్త తరహా సైబర్ మోసం దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తోంది. ఇలాంటి నిజ జీవిత ఘటనలనే ఆధారంగా తీసుకుని తెరకెక్కిన గుజరాతీ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధరపకడ్’ (Dharpakad). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్‌తో పాటు ప్రతి కుటుంబానికి ఉపయోగపడే అవగాహనను అందించే ఈ చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠగా సాగుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అహ్మదాబాద్‌లో నివసించే ఒక మధ్యతరగతి కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంటుంది. కుటుంబ పెద్ద తన జీవితమంతా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని భవిష్యత్తు కోసం దాచి పెడుతుంటాడు. అలాంటి సమయంలో ఒక రోజు అతనికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి వీడియో కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి తాము సీబీఐ అధికారులు, పోలీసులమంటూ పరిచయం చేసుకుని, అతని కొడుకు అర్జున్ ఒక పెద్ద ఆర్థిక నేరంలో చిక్కుకున్నాడని చెబుతారు.

Advertisement

మొదట ఇది సాధారణ కాల్ అనిపించినా, తర్వాత నకిలీ ఐడీలు, అధికారిక పత్రాలు, చట్టపరమైన పదజాలంతో అతడిని పూర్తిగా భయపెడతారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదని, ఇంట్లోనే ఉండాలని, ఫోన్ ఎప్పుడూ వీడియో కాల్‌లోనే ఉంచాలని ఆదేశిస్తారు. ఇదే ‘డిజిటల్ అరెస్ట్’. నిజంగా ఎలాంటి అరెస్ట్ జరగకపోయినా, మానసిక ఒత్తిడితో అతడిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటారు.

కుటుంబ సభ్యుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, బ్యాంక్ ఖాతాలు సీజ్ అవుతాయని బెదిరిస్తూ అతడి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బంతా ఒకదాని తర్వాత ఒకటి తమ అకౌంట్లకు బదిలీ చేయించుకుంటారు. తాను ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నాననే నమ్మకంతో ఆ తండ్రి తన జీవితకాల కష్టార్జితాన్ని మొత్తం కోల్పోతాడు.

Advertisement

కొంత సమయం తర్వాత తాము ఘోరంగా మోసపోయామని కుటుంబం గ్రహిస్తుంది. అప్పటికే డబ్బు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. తన తండ్రిని మోసం చేసిన వారిని వదిలి పెట్టకూడదని అర్జున్ నిర్ణయించుకుంటాడు. డిజిటల్ మోసాల వెనుక పని చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు అతను చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే ప్రమాదాలు, ఒక్కో ఆధారాన్ని వెతుక్కుంటూ అసలు ముఠాకు చేరువయ్యే విధానం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

ఈ నేరాల వెనుక నిజంగా ఎవరు ఉన్నారు ? వేలాది మంది అమాయకులను మోసం చేస్తున్న ఈ వ్యవస్థను అర్జున్ ఎలా ఎదుర్కొన్నాడు ? చివరకు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందా ? అనే అంశాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

ప్రస్తుతం ‘ధరపకడ్’ ShemarooMe ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గుజరాతీ భాషలో రూపొందిన ఈ చిత్రం సైబర్ క్రైమ్‌లపై అవగాహన పెంచే బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సిన మోసాల గురించి అవగాహన కల్పించే సినిమా చూడాలనుకుంటే మీ వాచ్‌లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన సినిమా ఇది. ఒక్క వీడియో కాల్ జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో ఈ సినిమా గట్టిగా గుర్తు చేస్తుంది.

Read Also: గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్

Tags

Related News

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×